32.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

గ్రీన్ కారిడార్ గా హైదరాబాద్ మెట్రో రైలు

హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో ఈ రోజు మైలు రాయిగా మిగలనుంది. గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఓ వ్యక్తి గుండెను తరలించేందుకు మెట్రో రైలును ఈ రోజు గ్రీన్ కారిడార్ గా ఉపయోగించారు. భాగ్య నగరంలోని ఎల్ బి నగర్ లో ఉన్న కామినేని ఆస్పత్రి నుంచి ఓ దాత గుండెను… లక్డీకాపూల్ లోని గ్రెనిగేల్స్ గ్లోబల్ అస్పత్రికి మెట్రో రైలు ద్వారా తరలించారు.

సంక్రాంతి పండుగ తర్వాత స్వస్థలాల నుంచి రాజధానికి వచ్చే వాహనాలు అధికంగా ఉండటం… ట్రాఫిక్ రద్దీ  సమయం కావటంతో గుండె తరలింపునకు మెట్రో రైలును ఎంచుకున్నారు.   గుండె తరలింపులో మెట్రో యాజమాన్యం త్వరగా స్పందించి గ్రీన్ కారిడార్ ఏర్పాటుకు సహకరించింది. 13 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13 నిమిషాల్లో గుండెను చేర్చి ట్రాన్స్ ప్లాంటేషన్ కు మెట్రో యాజమాన్యం సహకరించింది.

జ‌న‌వ‌రి 17వ తేదీన శుక్రవారం రాత్రి 9.30 నిమిషాల స‌మ‌యంలో మెట్రో రైలు ద్వారా డోనార్ గుండెను త‌ర‌లించారు. ఎల్ బినగర్..మియాపూర్ రూట్లో చేపట్టిన తరలింపు కార్యక్రమం 13 కిలోమీటర్లు, 13 మెట్రో స్టేషన్లను 13 నిమిషాల్లో తరలించటంపై అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com