36.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

తిరుమలలో మెరిసిన దివి

హైదరాబాద్ కు చెందిన దివి వైద్య 2019లో వచ్చిన మహర్షి సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టింది. నటి దివి తాజాగా బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో సందడి చేసే దివి తాజాగా తిరుమలలో ఏడుకొండల స్వామిని దర్శించుకున్న ఫోటోలు షేర్ చేసింది.

1996 మార్చి 15న జన్మించిన దివి వైద్య.. పదవ తరగతి వరకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో చదివింది. జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది.

దివి సినిమాల మీద మక్కువతో 2017లో మోడ‌లింగ్‌తో తన కెరీర్ మొద‌లు పెట్టింది. పలు ఫాషన్ సంస్థలకు మోడలింగ్ చేసింది.

పుష్ప2, డాకు మహారాజ్ లో ఓ మాదిరి పాత్రల్లో మెరిసిన దివి…హీరోయిన్ గా నిలదొక్కకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

డాకు మహారాజ్ సినిమా షూటింగ్ గ్యాప్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలు కొద్ది రోజుల క్రితం విడుదల చేసింది. వాటిలో దివి స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి

బిగ్ బాస్ 4లో పాల్గొన్న దివి ఓ రేంజ్ లో రచ్చ చేసంది. చివరకు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినా మంచి గుర్తింపు వచ్చింది.

దివి కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించింది. అందులో ‘క్యాబ్ స్టోరీస్’అనే వెబ్ సిరీస్ లో ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఓవైపు సినిమాలు,డ్యాన్స్ వీడియోలు, షోెలు చేస్తూ బిజీగా ఉండే దివి… మరోవైపు సోషల్ మీడియాలో అందమైన ఫొటోలను పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com