32.3 C
Hyderabad
Tuesday, August 11, 2026

Live Video

spot_img

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు సాధ్యమేనా…?

  • ఫిరాయింపులపై బిఆర్ఎస్ లీగల్ ఫైట్
  • ఒకవైపు న్యాయపోరాటం మరోవైపు రాజకీయంగా ఇరుకును పెట్టే ప్రయత్నం
  • ఫిరాయింపుల ఎమ్మెల్యేలో రేవంత్ పట్ల అసంతృప్తి
  • పోచారంకు మంత్రివర్గంలో స్థానం లేనట్టేనా…?
  • మళ్లీ టిఆర్ఎస్ వైపు దానం చూపులు
  • ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్లదే తుది నిర్ణయం
  • చట్టంలో మార్పులు తెస్తే తప్ప యాక్షన్ సాధ్యం కాదంటున్న నిపుణులు

తెలంగాణలో టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా బిఆర్ఎస్ భీ ఫామ్ పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై యాక్షన్ తప్పదంటూ బిఆర్ఎస్ న్యాయ పోరాటాన్ని ప్రారంభించింది. తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం న్యాయపరంగా ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్న అంశం కన్నా రాజకీయంగానే దీన్ని ఎదుర్కోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది.

సుప్రీంకోర్టు కేసు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తుపై చర్చ ప్రారంభమైంది. ఇప్పటికిప్పుడు వీళ్లకు ఇబ్బంది లేకపోయినా రాజకీయంగా మాత్రం కొంత సమస్య తప్పదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఉన్న చట్టం వల్ల వెంటనే ఇలాంటి ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, బీహార్ వంటి రాష్ట్రలకు సంబంధించిన ఫిరాయింపు కేసులు ఇప్పటికి కొలిక్కి రాలేదు. న్యాయస్థానాలు దీంట్లో ఎంతవరకు జోక్యం చేసుకుంటే అప్పటికీ చర్చ జరుగుతుంది. ఇక ఫిరాయింపుల విషయానికొస్తే చాలాకాలం నుంచి భారత రాజకీయ వ్యవస్థ పార్లమెంట్, విదానసభల ఫిరాయింపుల ద్వారా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఎక్కువ అస్థిరతను, గందరగోళాన్ని తెచ్చిపెట్టింది. 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి ఫిరాయింపుల వ్యతిరేకతపై 52వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. దీనిని రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 101, 102, 190, 191లు కూడా పార్టీ ఫిరాయింపుల గురించి తెలుపుతాయి. 10వ షెడ్యూల్‌కు సంబంధించి సందర్భానుసారంగా కొన్ని పదాలకు అన్వయింపు కింది విధంగా ఉంటుంది. ఎ సభ అంటే పార్లమెంట్లోని ఉభయ సభలు లేక రాష్ట్ర శాసనసభ బి. శాసనసభ పార్టీ అంటే ఒక చట్టసభలో ఒక నిర్దిష్ట సమయానికి ఒక రాజకీయ పార్టీకి గల సభ్యుల మొత్తం.

ప్రస్తుతం ఉన్న చట్టంలో కొన్ని సవరణలు చేస్తేనే తప్ప ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. మరి కోర్టులు దీనిపై స్పష్టమైన డైరెక్షన్ ఇస్తాయా అన్న అంశంపై క్లారిటీ లేదు. ఫిరాయింపుల అనర్హత విషయంలో స్పీకర్​ లేదా చైర్మన్​దే అంతిమ నిర్ణయమా అనే చర్చ ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఫిరాయింపుల అనర్హత విషయంలో స్పీకర్​ లేదా చైర్మన్​దే అంతిమ నిర్ణయం. హైకోర్టు, సుప్రీంకోర్టులు న్యాయ సమీక్ష మాత్రమే చేయవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే బిఆర్ఎస్ నుంచి చేరిన వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవిని ఆశించారు. ఆ స్థాయి పదవి ఇస్తేనే పార్టీ మారతానని పోచారం ముందుగా రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది. అదేవిధంగా మరికొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉంది అయితే చేరి చాలా రోజులైనా ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా దానం నాగేందర్ మళ్లీ కెసిఆర్ కేటీఆర్ లను ఉద్దేశించి పాజిటివ్‌గా కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకుగా దారితీసింది. ఎన్నికల ఫలితాలు తర్వాత బిఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ వైపు వెళ్లారు. తాజాగా ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. టిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ వైపు వెళ్ళిన సంజయ్ కూడా ఆశించిన స్థాయిలో తనకు కాంగ్రెస్‌లో గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిసింది. మొత్తానికి ఫిరాయింపుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఇటు న్యాయపరంగా ఇబ్బందులతో పాటు రాజకీయంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com