35.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

కుంభమేళాలో నాస్తికవాదులకు బడితె పూజ

కుంభ మేళాలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ప్రయాగ్ రాజ్ లో మకర సంక్రాంతి అమృత స్నానాల సందర్భంగా ఒక వింత సంఘటన జరిగింది. కొంతమంది యువకుల గుంపు చేసిన వెకిలి చేష్టలకు వారు చావు దెబ్బలు తిన్నారు. నాస్తిక వాదాన్ని ప్రచారం చేసేందుకు యత్నించిన యువకులను బడితె పూజతో నాగ సాధువులు సన్మానించారు.

మహా కుంభమేళా ప్రాంతంలో మన మహా కుంభమేళా ఒక బూటకమని పోస్టర్లు పట్టుకుని యువతీ,యువకులు ప్రదర్శించారు. వీటికి సంబంధించిన పుస్తకాల పంపిణీ చేయటం ఆరంభించారు.  అటుగా వెళుతున్న నాగ సాధువులు కంట ఈ దృశ్యం పడింది.

హిందు మతాన్ని అవమానిస్తున్న వారిని ప్రశ్నించిన నాగ సాధువులు వారిని చితకబాదారు. ఎవరో కొందరు ప్రయాగ్ రాజ్ కు వచ్చి  కుంభమేళను గుడ్డి నమ్మకం అని పిలుస్తున్నారు. సంస్క్రతి సంప్రదాయాలను కించపరిచే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా నాగా సాధువులు హెచ్చరించారు.

వీరికి  స్థానికుల కూడా తోడవటంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బాధిత యువకుల గుంపును అదుపులోకి తీసుకున్న పోలీసులు… పరిస్థితి చేయి దాటకుండా నాగ సాధువులను సముదాయించారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com