27.8 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

ఐదు కార్లున్నా.. ఆటోలో ఆస్పత్రికి సైఫ్

  • ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ ఛేదించగలరా?
  • ఇంట్లో వ్యక్తుల ప్రమేయం లేకుండా ఈ దాడి జరుగుతుందా?

సైఫ్ ఆలీఖాన్ అంటే తక్కువ వాడేం కాదు.. టైగర్ పటౌడీ, షర్మిల ఠాగూర్ల ముద్దుల సంతానం. ఆస్తులకు కొదవ లేదు. కాలు కదిపితే లగ్జరీ కార్లు, సువిశాలమైన బంగ్లాలు, ఎస్టేట్ లు, చేతినిండా నౌకర్లు, చాకర్లు..ఈగ కూడా వాలనివ్వని బౌన్సర్లు.. ఇలా విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్. ఇంత హై ప్రొఫైల్ మనుషులను హత్య చేయాలంటే అది ఆషా మాషీ స్కెచ్ పనికి రాదు. కానీ ఆగంతకుడు ఏకంగా ఇంట్లోకి చొరబడి చిన్న కత్తితో దాడి చేశాడంటే ఆశ్చర్యం కలిగిస్తోంది.పైగా ఫైర్ ఎగ్జిబిట్ లో నుంచి లోపలికి ప్రవేశించాడని, అదీ ముందురోజే అక్కడకు చేరుకున్నాడనీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంత చాకచక్యంగా లోపలికి వచ్చి అటాక్ చేయాల్సినంత అవసరమేమొచ్చింది అన్నదే ఇప్పుడు పోలీసులను వేధిస్తున్న ప్రశ్న. ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఒక ఆటోలో ఆస్పత్రికి చేరుకున్నాడంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. సైఫ్ దగ్గర అప్పుడు అందుబాటులో ఐదు కార్లున్నాయి. కానీ డ్రైవర్ అందుబాటులో లేడు. పైగాకారును షెడ్ లోంచి షట్టర్ ఎత్తి బయటకుతీయడం కష్టం.. అప్పటికే రక్తం చాలా పోయింది. టైమ్ లేదు. అందుకే సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం తండ్రిని చేతులపై మోసుకుని గేటు బయటకొచ్చి అటుగా పోతున్న ఆటో ఆపి అందులోకి ఆదరా బాదరా ఎక్కించి రెండు కిలోమీటర్ల దూరంలోని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సైఫ్ కండిషన్ ను చూసిన వైద్యులు మరికాస్త ఆలస్యమై ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని చెప్పారు. ప్రస్తుతం మూడు సర్జరీల తర్వాత సైఫ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఐసీయూలో ఉన్నాడు. ఈ సీన్ మొత్తం చూస్తుంటే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.. అంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న నటుడు చివరకు ఆటోలో ఆస్పత్రికి పరిగెత్తాల్సి రావడం కేవలం యాధ్రుచ్ఛికం.. సంక్లిష్లంగా మారిన ఈ కేసులో ఇంట్లో వ్యక్తుల ప్రమేయాన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి. దాడిలో తీవ్రంగా గాయపడిన పనిమనిషి రోల్ ని కూడా శంకిస్తున్నారు. ఈ కేసును ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ కు అప్పగించారు.చూడాలి మరి చిక్కుముడి ఎలా వీడుతుందో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com