27.8 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

సైఫ్ ఆలీఖాన్ హత్యాయత్నంలో కొత్తకోణం

  • రూ.కోటి రూపాయలు డిమాండ్ చేసిన ఆగంతకుడు
  • సైఫ్ వెన్నులో దిగబడిన రెండున్నర అంగుళాల కత్తి
  • నటుడికి మూడు సర్జరీలు.. ఐసీయూలో సైఫ్
  • ప్రాణాపాయం లేదన్న వైద్యులు
  • ముంబైలో సెలబ్రిటీలకు భద్రత లేదని విమర్శలు
  • ఫడ్నవిస్ సర్కార్ పై విమర్శల వర్షం..

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పై హత్యాయత్నం కేసులో కొత్త సంగతులు బయటపడుతున్నాయి. సైఫ్ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు ఘర్షణలో విచక్షణా రహితంగా ముగ్గురిని గాయపరిచాడు. సైఫ్, ఆతని కొడుకు జహంగీర్ కేర్ టేకర్, మరో పనిమనిషి ఈ దాడిలో గాయపడ్డారు. పైగా ఆగంతకుడు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు తాజాగా బయటపడింది. సైఫ్ ఉంటున్న బంద్రా వెస్ట్ లోని అపార్ట్ మెంట్ హై ప్రొఫైల్ ఏరియాలో ఉంది.అసలీ ఇంట్లోకి కొత్తవారు ప్రవేశించే ఆస్కారమే లేదు. ఇంటి దగ్గర గట్టి సెక్యూరిటీ ఉంటుంది. ఆగంతకుడు పక్క బిల్డింగ్ లోంచి కాంపౌండ్ వాల్ దాటి లోపలికి దూకినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి సైఫ్ ఆలీఖాన్ ఇంటిలోకి ప్రవేశించాడు.12 అంతస్తుల ఆ అపార్టుమెంటులో నాలుగు ఫ్లోర్లలో సైఫ్ కుటుంబం ఉంటోంది. రాత్రి సైఫ్ కుమారుడు నాలుగేళ్ల జెహంగీర్ పడుకున్నబెడ్ రూమ్ లోకి ఆ దొంగ ప్రవేశించాడు.

కోటి రూపాయలు డిమాండ్ చేసిన దొంగ…

సైఫ్ ఇంట్లో జెహంగీర్ ను చూసేందుకు నాలుగేళ్ల నుంచి ఎలిమా ఫిలిప్స్ అనే కేర్ టేకర్ వారితోనే ఉంటోంది. ఆగంతకుడిని ఆమె ముందు చూసింది. ఘటన జరగడానికి సరిగ్గా మూడు గంటల ముందు జెహంగీర్ ను కేర్ టేకర్ నిద్ర పుచ్చింది. తన పనులు ముగించుకుని పడుకునే టైమ్ లో జెహంగీర్ బాత్రూమ్ లో లైటు వెలగడం చూసి కేర్ టేకర్ ముందు అనుమానించింది. అయితే కరీనా కపూర్ మామూలుగా చెకింగ్ కోసం వచ్చారేమో అని భావించింది. అయితే కొంత సేపటికి జెహంగీర్ బాత్ రూమ్ లోనుంచి దొంగ బయటకు రావడం చూసి పెద్ద పెట్టున అరుస్తూ ఎదురుతిరిగింది. దొంగను నిలువరించే ప్రయత్నం చేసింది. అరిస్తే చంపేస్తానని కత్తితో బెదిరించిన దొంగ కోటిరూపాయలు డిమాండ్ చేశాడు. ఇంతలో అరుపులకు సైఫ్ నిద్ర లేచారు. ఘర్షణ శబ్దాలు విని కింద ప్లోర్ లోకి పరిగెత్తుకు వచ్చారు. ఆగంతకునితో గొడవ పడ్డారు. ఈ పెనుగులాటలో దొంగ కత్తితో సైఫ్ వెన్నులో, మెడపైనా, చేతిపైనా బలంగా కత్తి పోట్లు పొడిచాడు. ఈ క్రమంలోనే కత్తి చివర విరిగి పోయి వెన్నులో రెండు అంగుళాలు గుచ్చుకుపోయింది. రక్తం ధారగా స్రవిస్తుండటంతో సైఫ్ ను ఆస్పత్రికి తరలించారు. కారు స్టార్ట్ కాకపోవడంతో ఒక ఆటో రిక్షాలో సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం దగ్గరలోని లీలావతి ఆస్పత్రికి తరలించాడు.
సైఫ్ కు అత్యవసరంగా మూడు సర్జరీలుచేశారు. ప్రాణాపాయం లేదని, పరిస్థితి స్థిరంగానే ఉందని సైఫ్ ను ఐసీయులో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ఆగంతకుడు టీషర్టు, జీన్స్ ధరించి ఉన్నాడు. మెడలో ఆరెంజ్ కలర్ స్కార్ఫ్ ధరించాడు.

ఆగంతకుడు హిందీలో మాట్లాడాడని తెలుస్తోంది.56 ఏళ్ల ఎలిమా అతనితో ఘర్షణ పడి పెద్దగా కేకలు వేయడంతో పై ఫ్లోర్ లో ఉన్న సైఫ్ పరిగెత్తుకు వచ్చాడు.ఈలోగా మరో సర్వెంట్ గీతా కూడా పరిగెత్తుకు వచ్చింది. ముగ్గురు కలిసినా ఆగంతకుడిని నిలువరించలేకపోయారు.సైఫ్ ఆలీఖాన్ కు వెన్నులో చాలా లోతైన గాయం అయ్యింది. గట్టి భద్రతను దాటుకుని ఆగంతకుడు లోపలికి ఎలా వచ్చాడన్నది ప్రశ్నగా మారింది.

ఫడ్నవిస్ పై విమర్శల వర్షం…

బాలీవుడ్ వర్గాల్లో ఈ సంఘటన కలకలం రేపింది. మరో వైపు కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వానికి కూడా ఇది సవాల్ గా మారింది. ముంబై లో రక్షణ లేదన్న వాదనలను సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కొట్టి పారేశారు. సంఘటన దురద్రుష్టకరమని, ఎలా జరిగిందో ఆరా తీస్తున్నామని తెలిపారు. మరోవైపు ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఏకి పారేస్తోంది. ముంబైలో సెలబ్రిటీలకు భద్రత కరువైంది.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని శివసేన ఉధ్ధవ్ ఠాక్రే వర్గం నేత విమర్శించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, త్రుణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఈ ఘటనపై బీజేపి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com