22.7 C
Hyderabad
Friday, November 27, 2026

Live Video

spot_img

వెలిమలను లగచర్లగా మార్చొద్దు…ఎంపి రఘునందన్ రావు హెచ్చరిక

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి మయమైందని బిజెపి ఎంపి రఘునందన్ రావు తీవ్రమైన ఆరోపణలు చేశారు. పాలనలో ఏమీ తేడా లేదని…ఒక్క రంగు పోయి మూడు రంగులు వచ్చాయి తప్పా ఏం మారలేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు…కొందరు అమాత్యులు భాగ్యనగరం చుట్టూ ఉన్న భూములపై కన్నేశారని ఆరోపించారు.

రఘునందన్ రావు ఆరోపణల్లో ముఖ్యాంశాలు

సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోని శంకర్ పల్లి, రామచంద్రాపురం మండలాల మధ్యలో ఒక భూ వివాదం చాలా రోజులుగా కొనసాగుతోంది. శంకర్ పల్లి మండలం కొండకల్, రామచంద్రాపురం మండలంలో వెలిమల గ్రామ శివారు మధ్యలో మిగిలిన భూమి 429 ఎకరాలు ఎవరిది అని ప్రభుత్వ అధికారులు గుర్తించారు.

భూమి దున్నుకుంటూ ఉన్నామని గిరిజనులు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగారు. అందులో 180 ఎకరాల భూమి వివిధ పరిశ్రమలకు APIIC కి కేటాయించారు. సర్వే సెటిల్మెంట్ లో భాగంగా రామచంద్రాపురం వేలిమల గ్రామానికి కొత్త సర్వే నెంబర్లు కేటాయించారు.

శంకర్ పల్లి ఎమ్మార్వో తొలగించలేదు. రామచంద్రాపురం ఎమ్మార్వో యాడ్ చేయలేదు. రంగారెడ్డి జిల్లాకు చెందిన భూసామి కేవి నర్సింహారెడ్డి 1979 లో సీలింగ్ చట్టం కింద ప్రభుత్వానికి ఇచ్చారు. 429 ఎకరాల్లో చివరకు 85 ఎకరాలు మిగిలింది. BRS ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆ భూమిపై కన్నుపడింది. 2009లో మొదలైన భూ పంచాయతీ కొనసాగుతోంది.

2023లో సెక్షన్ 87 ప్రకారం క్లారికల్ ఎర్రర్స్ జరిగినప్పుడు రెండు సంవత్సరాల్లో సరిచేయవచ్చు. ప్రభుత్వ భూమిని మార్చడం క్లరికల్ ఎర్రర్ కాదని స్పష్టంగా ఉత్తర్వులు ఉన్నప్పటికీ…కలెక్టర్ తెలివిగా రిపోర్ట్ ఇచ్చారు. 1954లో తప్పు జరిగిందని టీ. శిల్పా రెడ్డి w\o కళ్యాణ్ రెడ్డి, రోహిణి రెడ్డి w/o విక్రమ్ రెడ్డి, నిత్యానంద రెడ్డి తదితరులు ఆ భూమి తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

గిరిజనుల మీద 17 కేసులు పెట్టారు. ఊర్లో ఎవరు ఉండకుండా ఖాళీ చేయించి 85 ఎకరాలు పోలీసుల రక్షణలో కబ్జా చేస్తున్నారు. సంగారెడ్డి పోలీసులు మూడు రోజులుగా వెలిమాల శివారులో డ్యూటీ చేస్తున్నారు. సుమారు 12 వందల కోట్ల రూపాయల భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. డీజీపీకి చెబుతున్నాం రేపు ఆ స్థలానికి వెళ్తాం. 85 ఎకరాలు ప్రైవేటు కంపెనీకి ఎలా ఇస్తావు.

ప్రభుత్వ భూమి అమ్మకానికి పెట్టి రైతు భరోసా ఇయ్యు. ఏ మంత్రి ఈ కబ్జాకు సహకరిస్తున్నారు? అరబిందో, అపర్ణ సంస్థల పేర్లు పహానిలో రాసే ప్రయత్నం చేస్తున్నారు. CCLAకు పెట్టిన దరఖాస్తులో నిత్యానంద రెడ్డి పేరు ఉంది. అందుకే ఆయన పేరు ప్రస్తావన పెట్టారు. రాష్ట్ర క్యాబినెట్ లో అతను నెంబర్ 2, నెంబర్ 3 యో తెలియదు. కబ్జాలో ఉన్న గిరిజనులకు భూమి ఇయ్యాలి. మరో లగచర్లగా మార్చవద్దు. రేపు ఉదయం 11 గంటలకు వెలిమల శివారులో సాగు చేస్తున్న భూముల దగ్గరకు వెళ్తా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com