- ఎఫ్ బిఐ అదుపులో మెక్సికో పౌరుడు
- మరిన్ని వీడియోలు వెలుగులోకి..
- ఉద్దేశపూర్వకంగానే భవంతులు తగులబెట్టారా?
- సోషల్ మీడియాలో మండిపడుతున్న సెలబ్రిటీలు
- సర్క్యులేషన్ లో మరిన్ని కథనాలు
- అయితే మంటలకు అతడే మూలం అనలేమంటున్న పోలీసులు
- రానున్న రోజుల్లో మరింత ఉథృతంగా గాలులు
- మంటలు మరింత విస్తరించే ప్రమాదముందంటున్న అధికారులు
లాస్ ఏంజెలిస్ కార్చిచ్చుకు ఓ అక్రమ వలసదారుడే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎఫ్బీఐ అతగాడిని అరెస్టు చేసి విచారిస్తోంది. మెక్సికో పౌరుడు మేన్యువల్ సియారా లెవ్యా ఈ అగ్ని ప్రమాదానికి కారణమని, అతడే స్థానిక ఆస్తులకు నిప్పు అంటించినట్లు ఒక వీడియో కూడా బయటకొచ్చింది. లెవ్యా చేతిలో ఓ దివిటీ కూడా ఆ వీడియోలో ఉంది. కాలిఫోర్నియాలో ఆస్తులకు నిప్పు పెట్టడంతో అది అడవులకూ వ్యాపించిందని ఎఫ్ బిఐ నిర్ధారణకు వచ్చింది. సియారా లెవ్యా ఒక సైకిల్ పై వుడ్ ల్యాండ్ హిల్స్ సమీపంలో మండుతున్న దివిటీని పట్టుకుని వెళుతూ స్థానికుల కంట పడ్డాడడు. ఓ కారు వెనక నక్కిన అతగాడిని స్థానికులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. పైగా ఈ మంటలు ఆర్పే ప్రసక్తి లేదు నేనే అంటిస్తున్నా అంటూ లెవ్యా పెద్దగా నినాదాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. లెవ్యాను కొందరు లాస్ ఏంజెలిస్ స్థానికులు పెడ రెక్కలు విరిచి కట్టి పట్టుకుని మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఎఫ్ బిఐ అధికారులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత గురువారం నుంచి ఉథృతమైన మంటలు కలబాసస్, కాలిఫోర్నియా అడవులకు విస్తరించడంతో స్థానికులను ఖాళీ చేయించాల్సి వచ్చింది. కాలిఫోర్నియాలో తాజాగా రేగిన కార్చిచ్చు మాత్రం ఉద్దేశ పూర్వకంగా రేపినదేనని భావిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో చేతిలో కొన్ని వస్తువులతో దొరికినందున సియారా లెవ్యాను అరెస్టు చేసినప్పటికీ కార్చిచ్చుకు మూల కారణం అతడేనని చెప్పలేమంటున్నారు లాస్ ఏంజెలిస్ అధికారులు. లెవ్యాను ఇంకా లోతుగా విచారిస్తున్న ఎఫ్ బీఐ సోమవారం అతగాడిని కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశముంది. సియారా లెవ్యా ను నిర్బంధించేందుకు అనుమతించమని అధికారులు కోర్టును కోరనున్నారు. కార్చిచ్చు ప్రమాదంలో 24 మంది చనిపోగా, ఏకకాలంలో ఆరు ప్రదేశాల్లోరాజుకుని వారం రోజులుగా అమెరికాను ముప్పతిప్పలు పెడుతోంది. ఈ కార్చిచ్చు కారణంగా 16మంది అదృశ్యం కాగా, 12 వేల భవనాలు, కొందరి సొంతిళ్లు సైతం మంటల్లో కాలిబూడిదైపోయాయి.
సోషల్ మీడియాలో మండిపడిన సెలబ్రిటీలు
అమెరికా కార్చిచ్చుకు కారకుడుగా భావిస్తున్న సియారా లెవ్యాపై సోసల్ మీడియాలో పెద్ద పెట్టున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అతగాడిని కఠినంగా శిక్షించాలంటూ ఖోలా కర్దాన్షియా లాంటి నటులు ఇన్ స్టా గ్రామ్ వేదికగా మండిపడుతున్నారు. మిలియన్ డాలర్లు ఖర్చు చేసి నిర్మించుకున్న భవంతులు అన్నీ కాలి బూడిదైపోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పారిస్ హిల్టన్, స్పెన్సర్ ప్రాట్, ఆడమ్ బ్రోడీ, అన్నా ఫారిస్, మిలో వెంటిమిగ్లియా లాంటి సెలబ్రిటీలందరి ఇళ్లు బూడిద కుప్పలుగా మిగిలాయి.
రానున్న రోజుల్లో మరింత ముప్పు
అమెరికా కార్చిచ్చుకు అసలు కారణమేంటో ఇదమిద్ధంగా తెలియకపోయినా అనేకానేక కథనాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. న్యూఇయర్ వేడుకల్లో వాడిన బాణాసంచా పేలుళ్లు, పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ కూడా కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సమీప భవిష్యత్తులో ఉథృతమైన గాలుల వల్ల ఈ కార్చిచ్చు మరింత విస్తరింవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.