- దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు
- భారీ పెట్టుబడులే లక్ష్యం
- రేవంత్ రెడ్డి కి ఇది రెండో పర్యటన
- గత ఏడాది పర్యటనలు 40,232 వేలకోట్ల పెట్టుబడులు
- ఈసారి ఈ సంఖ్య భారీగా ఉంటుందన్న ప్రభుత్వ వర్గాలు
- పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు , సీఈఓ లతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి
తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు బయలుదేరింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి టీం కు ఇది రెండో దవోస్ పర్యటన. గత ఏడాది కూడా ప్రమాణస్వీకారం చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన చేపట్టారు. ఈ ఏడాది కూడా తెలంగాణకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు భారీ టార్గెటే పెట్టుకుని రేవంత్ రెడ్డి తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర అధికారుల బృందం దవొస్ కు వెళ్ళనుంది గత ఏడాది దావోస్ పర్యటన విజయవంతంగా జరిగిందని ప్రభుత్వ వర్గాలు అప్పట్లో ప్రకటించాయి. ఈ పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని… బిఆర్ఎస్ హయాంతో పోలిస్తే దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల్లో ఇది రెండింతలు ఎక్కువ అని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది.
పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయని భారీగా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చినట్లుగా ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కూడా చెప్పింది. ఈసారి కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలకు సంబంధించిన సీఈవోలు, ప్రతినిధుల తో రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. మైక్రోసాఫ్ట్ ,గూగుల్ పెప్సీ వంటి సంస్థలు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి హైదరాబాదును ఎంచుకుంటున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించేలాగా దావోస్‌లో కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ లో అదేవిధంగా తెలంగాణలో పరిశ్రమలకు పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను వివరించే పవర్ పాయిట్ ప్రజెంటేషన్లు రెడీ చేశారు. మొత్తానికి గతం కంటే ఈసారి పెట్టుబడులు భారీగా వస్తాయనే ఆశాభావంతో ప్రభుత్వం వర్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఏఐసీసీ నూతన కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి ఢిల్లీ వెళ్లారు. గురువారం 17వ తేదీ 6 గంటలకు ఢిల్లీ నుంచి సింగపూర్ బయలు దేరతారు. అక్కడ నాలుగు రోజుల పాటు సీయం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. తిరగి 20వ తేదీ 6.10 గంటలకు సింగపూర్ నుంచి జ్యూరిచ్ బయదేరి అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొంటారు. మళ్లీ 23వ తేదీ దుబాయ్ వెళ్లి 24వ తేదీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.