నాటీ గర్ల్ గా సినిమాల్లో ఆకట్టుకున్న కీర్తి సురేష్ పెళ్లి కాగానే మారిపోయింది. పెళ్లికి ముందు అమాయక అమ్మాయిలా సోషల్ మీడియాలో సందడి చేసిన మహానటి పెళ్లి తర్వాత తన స్టైల్ మార్చేసింది. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు జరుపుకునే కీర్తి సురేష్ ఈసారి భర్త అంటోనితో సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చీరకట్టులో దక్షిణ భారత సంస్క్రతిని ప్రతిబింబించింది. నూతన వధూవరులు కీర్తి సురేష్, ఆంటోనీ తాటిల్ ఇంట జరిగిన వేడుకల్లో విజయ్, కళ్యాణి ప్రియదర్శన్, మమిత బైజు వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
పెళ్లి తర్వాత ఏదో ఒక మిషతో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది. బాలీవుడ్ లో పాగా వేసేందుకే ఈ తతంగం అని సినిమా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించిన కీర్తి సురేష్ ఇటీవలే బాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ సినిమాలో నటించింది.
బేబీ జాన్ సినిమా ప్రమోషన్ కోసం హీరో వరుణ్ ధావన్ తో కలిసి దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు వెళ్లిన కీర్తి సురేష్ మంగళ సూత్రాలతో మోడ్రన్ డ్రసులు వేసుకోవటం గాసిప్స్ కు దారితీసింది.
పదిహేనేళ్ల నుంచి ప్రేమిస్తున్న తన ప్రియుడు ఆంటోనీతో 2024 డిసెంబర్ 20న గోవాలో సన్నిహితుల మధ్య కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. కీర్తీ సురేష్ పెళ్లి ఫోటోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి.
పదిహేనేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న మహానటి పెళ్లి పీటలు ఎక్కే వరకు సస్పెన్స్ కొనసాగించింది. స్కూల్ రోజుల నుంచి పరిచయం ఉన్న అంటోనితో కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డానని కీర్తి చెప్పుకుంది.