ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా బంధు మిత్రులతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. మూడు రోజులుగా స్వగ్రామంలోనే ఉన్న చంద్రబాబు రెండురోజు నారావారిపల్లిలో పర్యటించారు. ముందుగా గ్రామ కులదేవత గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కులదేవత నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంక్రాంతి పర్వదినం కావడంతో నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి నారా కుటుంబం సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నారు. అలాగే తల్లిదండ్రులు నారా ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నివాళులు అర్పించారు నారా, నందమూరి కుటుంబ సభ్యులు. అనంతరం నారావారిపల్లిలో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించారు.
చంద్రబాబు. సిఎం ఇంటి పక్కనే విగ్రహాల ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు నారా, నందమూరి కుటుంబ సభ్యులు. అనంతరం సిఎం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.