తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియామకం ఖరారైంది. సుజయ్ పాల్ ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. తాజాగా ఆయనకు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి లభించింది.
ఇటీవల సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసులతో తెలంగాణ హైకోర్టు ప్రస్తుత సీజే అలోక్ అరాథే బదిలీ అయ్యారు. జస్టిస్ అలోక్ అరాథేను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. దాంతో తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ ను నియమించారు. జస్టిస్ సుజయ్ పాల్ గతేడాదే బదిలీపై తెలంగాణ హైకోర్టుకు జడ్జిగా వచ్చారు.
1964 జూన్ 21న జన్మించిన జస్టిస్ సుజయ్‌పాల్ బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు సేవలు అందించిన ఆయన 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా… 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.