29.2 C
Hyderabad
Tuesday, August 25, 2026

Live Video

spot_img

శ్రీవారి బంగారం చోరీకి ప్రయత్నం

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విజిలెన్స్ అధికారు

భక్తులు శ్రీవారికి సమర్పించిన బంగారు కానుకలను దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఒక దొంగను టీటీడీ భద్రతా సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సుమారు వంద గ్రాముల బంగారాన్న దొంగిలించడానికి ప్రయత్నించిన దుండగుడ్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పరకామణిలో చోరీకి పాల్పడుతున్న అగ్రిగోస్ ఉద్యోగి పెంచలయ్యను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకున్నారు. పరకామణి నుంచి వచ్చేటప్పుడు వంద గ్రాముల బంగారాన్ని ట్రాలీ పైప్ లో పెట్టుకుని ఆలయంలోకి వస్తుండగా తిరుమల తిరుపతి దేవస్ధానం విజిలెన్స్ అధికారులు పెంచలయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బంగారం దొంగతనం విషయమై పెంచలయ్యను విజిలెన్స్ అధికారులు విచారించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పెంచలయ్యను అదుపుతోకి తీసుకుని కేసు నమోద చేశారు. పరకామణి నుంచి వెలుపలకు దొంగతనంగా బంగారం ఎత్తుకుని రావాడానికి పెంచలయ్యకు టీటీడీ సిబ్బంది ఎవరైనా సహాచం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదిఏమైనా స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు పరకామణిలో తరచు దొంగతనానికి గురవుతుండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com