నిజామాబాద్ లోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారీగా ఉత్తర ద్వారా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. దేవాలయంలో జరుగుతున్న వేడుకల్లో శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
నగరంలోని గంగాస్థాన్ లో వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం బారులు తీరారు.
స్వామీజీ కామెంట్స్
పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనసు కలిపి ఏకాదశి అంటాం. ఈ రోజు స్వామి సన్నిధిలో నిల్చుంటే అన్ని పాపాలూ పోతాయి. 330 కోట్ల దేవతల దర్శనం దొరికే రోజు ముక్కోటి ఏకాదశి. అలాంటి ముక్కోటి ఏకాదశి రోజు స్వామి వారి దర్శనం చేసుకుంటే జీవన్ముక్తి లభిస్తుంది.
అందుకే తిరుపతి కలియుగ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.. అంతటా స్వామి వారి ఆలయాల్లో భక్తులు నెమ్మదిగా క్రమశిక్షణతో ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి. ఒకే రోజు అని భక్తులు ఇబ్బంది పడొద్దు.. 10 రోజులు దర్శనం చేసుకున్నా ఫలం దక్కుతుంది.