27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

రాయ్ లక్ష్మి అందాల జాతర

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచతమైన రాయ్ లక్ష్మికి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సినిమా రంగంలోకి రాకముందు ఆమె మోడల్. సోషల్ మీడియాలో ఉర్రూతలూగించే రాయ్ లక్ష్మి…తాజాగా We’re under the same sky with different stories అని ట్యాగ్ చేసి హాట్ ఫోటోలు షేర్ చేసింది.

కర్ణాటకలోని బెలగావ్ కు చెందిన ఈ భామ అసలు పేరు లక్ష్మీ రాయ్.. ఈ పేరు కలిసి రావడం లేదని రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన వీళ్ల కుటుంబం కర్ణాటకలో స్థిరపడింది.

2005లో తమిళ సినిమా కరక కసధారతో సినీ రంగ ప్రవేశం చేసింది. తమిళంతో పాటు కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది.

బాలీవుడ్ లో జాలీ2 సినిమాలో అందాలు ఆరబోసి అదరగొట్టేసింది. రాయ్ లక్ష్మి హీరోయిన్ కు తక్కువ… ఐటం గర్ల్ కు ఎక్కువ అన్నట్టుగా మారింది.

‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లక్ష్మీ రాయ్… ఆ తర్వాత ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల ఖైదీ నెంబర్ 150లో ర‌త్తాలుగా మెగా బ్ర‌ద‌ర్స్‌తో చిందేసి టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

తెలుగు సినిమా ఆధినాయకుడులో బాలక్రష్టతో  హీరోయిన్ గా నటించింది. ఖైదీ నంబర్ 150, ‘సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో ఐటెం భామగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా మళ్లీ తెలుగు సినిమాలపై దృష్టి సారించిందని వార్తలు వస్తున్నాయి.

రాయ్ లక్ష్మి సినిమాల్లో నటన కంటే అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇవ్వటంతో… బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తుంది.

ప్రస్తుతం అంతగా సినిమాలు లేకపోయినా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. 2025 లో నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు వస్తే చేస్తానని అంటున్న రాయ్ లక్ష్మి.. ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకుంటానని స్నేహితులతో చెప్పేసింది.

 

35 ఏళ్ల వయసులోను అప్సరసలా కనిపిస్తోన్న రాయ్ లక్ష్మి ఫారిన్ ట్రిప్ లపై అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి. షూటింగ్ లో గ్యాప్ దొరికితే విదేశాలకు వెళ్లిపోతోందని అనుకుంటున్నారు.

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com