ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక పధకం ప్రకారం నిర్వీర్యం చేయాలని చంద్రబాబు సర్కార్ చూస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశ్రీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తీవ్రంగా స్పందిచారు. కవాలనే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హస్పటల్స్‌కి చెల్లించాల్సిన 3వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు జగన్మోహన్‌రెడ్డి. తమ బకాయిలు క్లియర్ చెయ్యకపోతే ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు వైద్య సేవలు ఆపేస్తామని నెట్‌వర్క్ ఆసుపత్రులు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతెందని జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీ అమలు కాకపోతే సుమారు కోటిన్నర మంది పేద, బడుగు వర్గాలకే కాకుండా దిగువ మధ్యతరగతి ఆగ్రవర్ణ పేదలకు కూడా వైద్యసేవలు అందుబాటులోకి లేకుండా పోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు వైద్య ఖర్చులు 25 లక్షల రూపాయలు అవసరమైనా సరే ఉచితంగా అందించాలనే సంకల్పంతో మా ప్రభుత్వ హయాంలో మెరుగు పరచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎందకు నాసనం చేస్తున్నారని జగన్మోహన్‌రెడ్డి కూటమి సర్కార్‌ని నిలదీశారు. పేదలు వైద్యం కోసం ఆసుపత్రులకు వెళితే ఆరోగ్యశ్రీ లేదనే మాట వినిపిస్తున్నా మీరు ఎందుకు స్పందించడం లేదని ఆయన ఎక్స్ వేదికగా చంద్రబాబు సర్కార్ ని నిలదీశారు. రాష్ట్ర ప్రజల ఆస్తిగా భావించి 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలను చేపడితే ఇప్పుడు వాటిని చంద్రబాబు తన అనూయాయులకు అమ్మేస్తున్న విధానంలోనే ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేటు పరం చేయడం నిజం కాదా అని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రైవేటు భీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీ అప్పగిస్తే వారు పెట్టే ఇబ్బందులకు పేదలు అవస్ధలు పడరా అని జగన్ ప్రశ్నించారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్ధితుల్లో మా ప్రభుత్వం విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి వైద్యసేవలందించామని ఇప్పుడు అటువంటి అరుదైన వ్యాధుల విషయంలో ప్రైవేటు కంపెనీలు స్పందిస్తాయా, విజయవాడ వరద బాధితుల భీమా విషయంలో అది రుజువు అయ్యిందికదా అని నిలదీశారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని గతంలో ఉన్నట్లే యథాతధంగా కొనసాగించాలని ప్రజల తరుపున డిమాండ్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.