ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన అభిమాని శ్రీతేజ్‌ను ఎట్టకేలకు అల్లు అర్జున్ మంగవారం పరామర్శించారు. డిసెంబర్ 4వ తేదీన అల్లు అర్జున్ నంటించిన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య ధియేటర్ ఆవరణలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై అస్వస్తతకు గురై సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆనాటి నుంచి నేటి వరకూ అనివార్యకారణాల వల్ల శ్రీతేజ్‌ను చూడడానికి అల్లు అర్జున్ హాస్పటల్‌కి వెళ్లలేకపోయారు. ఈ కేసులో 11వ ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్‌కి మొన్నీ మధ్యే రెగ్యులర్ బెయిల్ వచ్చింది. దీంతో మంగళవారం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలసి శ్రీతేజ్‌ని పరామర్శించడానికి సికింద్రాబాద్‌లోని హస్పటల్‌కి వెళ్ళారు అల్లు అర్జున్. అంతకు ముందు హస్పటల్‌కి వెళ్ళడానికి రాంగోపాల్‌పేట పోలీసుల అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ టీమ్ శ్రీతేజ్ కు అయిన హస్పటల్ ఖర్చుల బాధ్యత తీసుకుంది. ఇంకా ఎంత ఖర్చైనా శ్రీతేజ్‌కు మెరుగైన వైద్యం అందించాలని అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రీతేజ్ భవిష్యత్తు విషయంలో కూడా పూర్తి బాధ్యతలు కూడా తీసుకుంటానని అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించారు.