తెలంగాణలో సంక్రాంతి సెలవుపై రాష్ట్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్కూళ్లు, కాలేజీలకు వేర్వేరుగా సెలవులను నిర్ణయించింది. స్కూళ్లకు ఏడు రోజులు, జూనియర్ కాలేజీలకు ఆరు రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు, జూనియర్ కళాశాలలకు ఈనెల 11 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది సర్కారు. కళాశాలలు జనవరి 17వ తేదీన పాఠశాలలు 18వ తేదీ శనివారం తెరుచుకోనున్నాయి
కాగా, ఇప్పటికే రిలీజ్ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఉండగా.. తాజాగా రెండు రోజులు ముందునుంచే సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.