కేటీఆర్‌పై రేవంత్ సర్కార్ పెట్టిన కేసు దేశంలోనే అతి చెత్త కేసని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి రైతు బంధు, అడ్డగోలు అప్పలు, కేటీఆర్‌పై అక్రమకేసులు బనాయించడంపై రాష్ట్ర ప్రభత్వం మీద మండిపడ్డారు. ఈకార్ రేస్ వ్యవహారంలో ఎక్కడా అవినీతి కనిపడకపోయినా మోడీ సహకారంతో రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. ఫాల్స్ కేసులు పెడితే చివరికి నష్టపోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రైతు భరోసా ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మీరు వంద శాతం రైతు బంధు ఇస్తే ఆలెక్కలు బయటపెట్టమని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ప్రమాణ పత్రాలు, నిబంధనలు పెట్టకుండా రైతు భరోసా ఇవ్వాలని అన్నారు. మేము కేసులకు భయడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అడ్డగోలుగా అప్పులు చేసి ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా కాంగ్రెస్ మంత్రులు తమ జేబులు నింపుకుంటున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం చేసిన 1.28 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఏం చేరో చెప్పాలని జగదీష్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్ రైతులను రాజులుగా చూస్తే… రేవంత్ రెడ్డి దొంగలుగా చేస్తున్నారని అన్నారు. హామీ ఇచ్చి మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల భరతం పట్టాలని జగదీష్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగట్టేందుకు ప్రజలంతా సిద్దంగా ఉండాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.