బాలీవుడ్ హీరోయిన్ సొనాల్ చౌహాన్ మొదటి సినిమాతోనే యూత్ ను వెర్రిత్తించింది. సొనాల్ హిందీతో పాటు బెంగాలి, తెలుగు, తమిళ, కన్నడ భాషల సినిమాల్లో నటించింది. దుబాయిలో కొత్త సంవత్సర వేడుకల విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంది.
సోనాల్ చౌహాన్ 1987 మే 16న నోయిడాలో జన్మించింది. నోయిడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుని, ఢిల్లీలోని గార్గి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
2005లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టైటిల్ గెలుచుకున్న తొలి ఇండియన్‌గా సోనాల్ నిలిచింది.
ఇమ్రాన్ హష్మీతో కలిసి జన్నత్(2008) చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనాల్. ఈ సినిమా హిట్ అయినప్పటికీ.. సోనాల్‌కి ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏం రాలేదు.
నీల్ నితిన్ ముఖేష్ హీరోగా 3G- ఎ కిల్లర్ కనెక్షన్ చిత్రంలో నటించిన సోనాల్ చౌహాన్… ఈ చిత్రంలో 30 కిస్ సీన్స్ తో పాత రికార్డులు బ్రేక్ చేసింది. గతంలో ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ చిత్రం మర్డర్ సినిమాలో అత్యధికంగా 20 కిస్ సీన్స్ ఉండగా.. ఆ రికార్డును 3G సినిమా బ్రేక్ చేసింది.
ఆమె మొదటి తెలుగు చిత్రం రెయిన్బో(2008). ఆ తర్వాత నాగార్జున, ప్రభాస్, రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. లెజెండ్, డిక్టేటర్, రూలర్, పండగ చేస్తో తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే సోనాల్ చౌహాన్… లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంది.