26.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

నూతన సంవత్సరం మొదటిరోజు చెత్తతో నిండిపోయిన ఉప్పల్‌ స్టేడియం

కొత్త సంవత్సరం మొదటిరోజు జనవరి ఒకటో తేదీన ఎవరైనా కొత్త ఆశలు, కొంగొత్త ఆశయాలతో, క్లీన్‌ అండ్‌ క్లియర్‌గా స్టార్ట్‌ చేయాలనుకుంటారు. పరిసరాలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. ఉదయాన్నే మంచి దృశ్యాలు చూడాలనుకుంటారు. సూర్యోదయంతో పాటు..పరిశుభ్రమైన పరిసరాలను ఆశిస్తారు. కానీ, ఉప్పల్‌లోని మున్సిపల్‌స్టేడియంలో రెగ్యులర్‌ వాకర్లకు ఆ అదృష్టం లేకుండా పోయింది. ఉప్పల్‌ మున్సిపల్‌ స్టేడియం మొత్తం అధ్వాన్నంగా కనిపించింది. కనీసం రోజూ ఉండే మాదిరిగా ఉంటుందనుకుంటే.. అలా లేదు. స్టేడియం అంతా తాగి పడేసిన బీరు, బ్రాందీ సీసాలు, మద్యం తాగి పడేసిన గ్లాసులు, తిని పడేసిన మటన్‌, చికెన్‌ వ్యర్థాలు, ఇలా.. ఆ ప్రాంతమంతా చూడలేకుండా తయారయ్యింది. పైగా దుర్గంధం ముక్కుపుటాలను అదరగొడుతోంది. తెల్లవారు జామునే వాకింగ్‌ కోసం రోజూ మాదిరిగానే ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లిన వాళ్లందరికీ ఎదురైన అనుభవం ఇది.

డిసెంబర్‌ 31వ తేదీన గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పార్టీలు చేసుకోవడాలు, విందులు, చిందులు సర్వ సాధారణమే. రాత్రి పన్నెండు గంటల దాకా డిసెంబర్‌ థర్టీ ఫస్ట్‌ వేడుకలు నిర్వహించే ప్రాంగణాల్లో ఇలాంటి దృశ్యాలు కొట్టిపడేయలేం. కానీ, తెల్లవారే సరికి ఆ ప్రాంతమంతా క్లీన్‌ చేయాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంటుంది. అదేదో వినియోగంలో లేని గ్రౌండ్‌ లాంటిదైతే మరుసటిరోజైనా శుభ్రం చేయొచ్చు. కానీ, నిత్యం ఏదో ఓ కార్యక్రమం జరుగుతూ ఉండే.. అలాగే, ఉదయం, సాయంత్రం వాకింగ్ ట్రాక్‌లు ఉంఏడ ఉప్పల్‌ మున్సిపల్‌స్టేడియంలో ఇలాంటి దృశ్యాలు తెల్లవారినా కనిపిస్తూనే ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. అందరి నుంచీ వివమర్శలకు కారణమవుతోంది.

మొత్తానికి గత రాత్రి కొత్త సంవత్సర వేడుకల నిర్వహణ తర్వాత ఉప్పల్‌ మున్సిపల్‌స్టేడియం చెత్తకుప్పలా మారిపోయింది. దీంతో, తెల్లవారు జామునే మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వాళ్లు షాకయ్యారు. ఎక్కడ చూసినా మద్యం సీసాలు, డిస్పోజబుల్ గ్లాసులే కనిపిస్తున్నాయి.దీంతో, ఆ పార్టీ నిర్వహించిన వాళ్లతో పాటు.. దీనికి పర్మిషన్‌ ఇచ్చిన అధికారులపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. న్యూ ఇయర్ వేడుకల కోసం ఓ ఈవెంట్‌ నిర్వాహకులకు అనుమతి ఇస్తే స్టేడియం మొత్తాన్నీ కంపు కంపు చేశారు. స్థానిక మున్సిపల్ స్టేడియం బుధవారం ఉదయం చెత్తకుప్పలా కనిపించింది. ఎక్కడ చూసినా మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు, డిస్పోజబుల్ గ్లాసులతో పాటు తిని పడేసిన మాంసం ముక్కలే కనిపించాయి. రోజూలాగే ఉదయం వాకింగ్ కు వచ్చిన స్థానికులు ఇది చూసి అవాక్కయ్యారు. స్టేడియంలో న్యూ ఇయర్ పార్టీ నిర్వహించిన వారితో పాటు, ఈ వేడుకలకు అనుమతిచ్చిన అధికారులపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి పార్టీ పూర్తయిన తర్వాత ఆ ప్రాంగణమంతా శుభ్రం చేయించాల్సిన నిర్వాహకులు.. అదేమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో స్టేడియం మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఇదంతా తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి, అధికారులు, పార్టీ నిర్వాహకుల తీరును ఎండగడుతున్నారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com