26.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

ముక్క.. మందు.. మగువ..

2025లో కొత్త పుంతలు తొక్కిన న్యూ ఇయర్ వేడుకలు…

కొత్త ఏడాది సంబరాలను ఎప్పుడూ అంబరాన్ని తాకేలా సెలెబ్రేట్ చేసుకోవడంలో యూత్ ముందు వరుసలోనే ఉంటుంది. జనవరి ఒకటి అనేది ఆంగ్ల సంవత్సరాది.. మన లెక్కల ప్రకారం కొత్త సంవత్సరం ఇది కాదని చెప్పినా.. ఎవ్వరూ వినరు గాక వినరు. పైగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్సును మరింత జోరుగా నిర్వహిస్తారు. ఇక న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అంటే చాలు.. మందు కంపల్సరీ.. ముక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలు మందుకు.. ముక్కకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. ఈ సెలెబ్రేషన్సును దృష్టిలో పెట్టుకునే మద్యం కంపెనీలు.. ఎక్కువగా మద్యాన్ని సరఫరా చేస్తాయి. అలాగే మాంసం కూడా ఎక్కువగా అందుబాటులో తెస్తారు. ఇది రోటీనుగా జరిగే వ్యవహరం. అయితే 2025 న్యూఇయర్ సెలెబ్రేషన్సు గతానికి భిన్నంగా.. నెక్స్ట్ లెవలుకు తీసుకెళ్లేలా జరిగాయి. అదేంటంటే.. మందు, ముక్కతో పాటు.. మగువ కూడా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ వేడుకల్లో ఓ భాగమై పోయినట్టు ప్రముఖ గ్రోసరీస్ డెలివరీ చేసే స్విగ్గి ఇన్స్టామార్ట్ సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం తేలింది. తమకు కండోములు కావాలంటూ సదురు సంస్థకు విపరీతంగా ఆర్డర్లు వచ్చాయట. ఈ తరహా ఆర్డర్లేంట్రా బాబూ అని ఆ సంస్థ నిర్వాహాకులే ఆశ్చర్యపోయేలా కండోములను సరఫరాకు భారీ ఎత్తున ఆర్డర్లు వచ్చాయట. డిసెంబర్ 31వ తేదీ ఐదున్నర గంటల వరకు 4779 మంది కస్టమర్లు కండోమ్ లు కావాలని అదే పనిగా ఆర్డర్లు చేస్తూ ఉన్నారట. ఆ తర్వాత కూడా కొన్ని ఆర్డర్లు వచ్చాయో.. ఆ తర్వాత సెలెబ్రేషన్సులో మునిగి తేలుతారు కాబట్టి.. అక్కడితో ఆగిపోయేయో తెలీదు కానీ.. స్విగ్గీ సంస్థ వెల్లడించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. ఇప్పటి వరకు కొత్త సంవత్సరం వేడుకలంటే మందు, ముక్క అనుకున్నాం.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. మందు, ముక్కతో పాటు మగువ కూడా ఆ జాబితాలో చేరిందా అని సరదాగా జోక్ లు వేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. ఇలా ఆర్డర్ చేసింది మగవాళ్లో.. ఆడవాళ్లోననే డేటా కూడా స్విగ్గి ఇస్తే మారుతున్న సమాజం పట్ల జనాలకు మరింత క్లారిటీ వచ్చేదంటున్నారు. ఈ వింత పొకడలకు ఆశ్చర్యపోవడం మినహా ఇంకేం చేయగలమని అంటున్నారు. పాశ్చాత్య సంస్కృతి పేరుతో విచ్చలవిడి తనం పెరుగుతుందనుకోవాలా..? లేక స్వేచ్ఛా స్వాంతంత్ర్యాలతో సమాజం పరిఢవిల్లుతుందని అనుకోవాలా..? అనేది అర్థం కావడం లేదని నిట్టూరుస్తున్నారు సంప్రదాయ వాదులు. అయితే ఇదంతా ఈ రోజుల్లో కామన్ లైట్ తీసుకోండి అంటూ కొందరు మార్పును స్వాగతిస్తున్నారు. 2025 కొత్త సంవత్సర వేడుకల అనుభవంతో డిసెంబర్ 31వ తేదీ నాటికి కండోమ్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తిని పెంచుకుని సరఫరాను పెంచే పరిస్థితి రావచ్చని జోకులేసుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com