26.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

పార్లమెంటరీ ఎన్నికల్లో పెరుగుతున్న మహిళల పాత్ర…

  • పెరుగుతున్న మహిళా అభ్యర్ధులు.. గెలుపు శాతం తక్కువే
  • ఈసారి రికార్డు స్థాయిలో ఓటేసిన మహిళలు
  • 2009 నుంచి పెరిగిన చైతన్యం..

మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా సాకారం కాకుండానే పార్లమెంటరీ ఎన్నికల పట్ల మన మహిళలకు అవగాహన గణనీయంగా పెరిగింది. గెలుపు ఓటముల విషయాన్ని పక్కన పెడితే 2024 లోక్ సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 800 మంది మహిళా అభ్యర్ధులు పోటీ చేశారు.దాదాపు 390 పార్లమెంటరీ నియోజక వర్గాల్లో వీరు పోటీ చేశారు. ఇది 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల కన్నా చాలా ఎక్కువ. ఈ వివరాలు ఇటీవల ఎన్నిల కమిషన్ వెల్లడించింది. 1957లో అతి తక్కువ మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేయగా 152 నియోజక వర్గాలకు మహిళా అభ్యర్ధులే లేరు. అయితే దీనిని సరిపోల్చడానికి 1951,1971లకు సంబంధించిన డాటా ఎన్నికల కమిషన్ దగ్గర లేదు.

2009 నుంచి మారిన మగువల తీరు…

కాలం గడుస్తున్నకొద్దీ మహిళా అభ్యర్ధుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2009లో 332 స్థానాల్లో మహిళా అభ్యర్ధులు పోటీ చేయగా, 2014లో అది 377 స్థానాలకు పెరిగింది. 2019లో 372 సీట్లలో మహిళలు పోటీ చేశారు. గణాంకాల ప్రకారం 2004లో మొత్తం 543 సీట్లకు సగానికన్నా కొంచెం తక్కువ(249) స్థానాలలో మహిళా అభ్యర్ధులు కనిపించారు. 1980 దశకం నాటికి ఈ సంఖ్య మరింత తగ్గి 200 మందికన్నా తక్కువ (127నుంచి 146 మథ్య)మాత్రమే ఎన్నికల బరిలోకి దిగారని గణాంకాలు చెబుతున్నాయి. 1957లో కేవలం 37 మంది మహిళలు మాత్రమే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో అసలు మహిళా అభ్యర్ధులే రంగంలో లేరు.

కొన్ని చోట్ల మహిళా అభ్యర్ధులే లేరు..
తెలంగాణకు అరుదైన రికార్డు…

యూపీలో దేశంలోనే అత్యధికంగా 30 స్థానాలకు మహిళా అభ్యర్ధులే కరువయ్యారు.రెండో స్థానంలో బీహార్ (15), మూడో స్థానంలో గుజరాత్ (14) ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో (2024) ఒక్కరైనా మహిళా అభ్యర్ధులు పోటీ చేసిన స్థానాలు 167. 119 నియోజక వర్గాల్లో ఇద్దరేసి మహిళలు బరిలో ఉండగా, 59 సీట్లలో ముగ్గురేసి, 25 సీట్లలో నలుగురు, పదిస్థానాల్లో 5గురు చొప్పున, ఐదు సీట్లలో ఆరుగురేసి చొప్పున, రెండు సీట్లలో ఏడుగురు, మూడు సీట్లలో 8 మంది చొప్పున బరిలో నిలిచారు. మూడు నియోజకవర్గాల్లో అత్యధికంగా 8 మంది చొప్పున మహిళలు బరిలోనిలవగా అందులో తెలంగాణ కూడా స్థానం దక్కించుకుంది. బారామతి, సికింద్రాబాద్, వరంగల్ ఎంపీ సీట్లలో ఒక్కో సీటులో 8 మంది చొప్పున మహిళలు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే మహిళా అభ్యర్ధుల సంఖ్య గణనీయంగా పెరిగినా గెలుపు అవకాశాలు మాత్రం పెద్దగా లేవు. కేవలం 74 మంది గెలవగా 629 మందికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు.

మహిళా ఓటర్లలో పెరుగుతున్న చైతన్యం…

ఇక ఎన్నికలలో ఓటేసే మహిళల విషయానికొస్తే ఈవివేచన గణనీయంగా పెరిగిందనే చెప్పాలి.2019 నుంచి మహిళా చైతన్యం పెరిగినా 2024లో పెద్ద సంఖ్యలోనే మహిళలు ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో 66.55 శాతం పురుషులు ఓటు హక్కు వినియోగించుకుంటే మహిళలల్లో 65.78 శాతం మంది ఓటేశారు. 2019 లో మహిళా ప్రభంజనమే కనిపించింది. స్వాతంత్ర్యం వచ్చాక అత్యధిక సంఖ్యలో 2019లో మహిళలు ఓటేయగా, మొన్నటి 2024 ఎన్నికల్లో మళ్లీ అంత భారీ స్థాయిలో మహిళలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. అస్సాంలోని దుబ్రి పార్లమెంటరీ స్థానంలో రికార్డు స్థాయిలో 92.17 శాతం మహిళలు ఓటేశారు. తర్వాత స్థానం పశ్చిమ బెంగాల్ లోని తమ్లుక్. అక్కడ 85.57 శాతం మహిళా ఓటర్లు నమోదయ్యారు. 2024 నాటికి 97.97 కోట్ల మహిళా ఓటర్లు ఉండగా వారిలో 47.63 కోట్ల మహిళలు ఓటు హక్కు ను రిజిస్టర్ చేసుకున్నారు. 2019లో ఇది 43.85 కోట్లుగా ఉంది.ఇక్కడ మరో ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తోంది. 2024లో ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 946 మంది మహిళా ఓటర్లు కనిపించారు. 2019లో వెయ్యి మంది పురుష ఓటర్లకు 926 మంది మహిళా ఓటర్లు మాత్రమే కనిపించేవారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com