35.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

యశస్వి జైశ్వాల్… 1478

  • 2024 క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు
  • మూడో భారత ఆటగాడిగా రికార్డు

యశస్వి జైశ్వాల్…టీమ్ ఇండియా యువ సంచలనం. టెస్టు జట్టులో తనదైన ముద్ర వేసుకున్న యువ ఆటగాడు ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2024 సంవత్సరంలో మొదలుపెట్టి ఇప్పటివరకు 1478 పరుగులు చేశాడు.

తనకన్నా ముందు 2010లో సచిన్ టెండూల్కర్ 1,562 పరుగులు, 1979లో సునీల్ గవాస్కర్ 1,555 పరుగులు సాధించారు. అలా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక యశస్వి తర్వాత నాలుగో స్థానంలో వీరేందర్ సెహ్వాగ్ ఉన్నాడు. తను 2008లో 1,462 పరుగులు చేయడం విశేషం.

మెల్ బోర్న్ టెస్టులో సీనియర్లందరూ విఫలమైన పిచ్ మీద ఆస్ట్రేలియా ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని రెండు ఇన్నింగ్సులో యశస్వి అద్భుతమైన ఆఫ్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో (82) పరుగులు చేసి అనుకోకుండా రన్ అవుట్ అయిపోయాడు. లేకపోతే అదొక సెంచరీ వచ్చేది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో దురద్రష్టవశాత్తూ అవుట్ అయ్యాడు. అది రివ్యూకి వెళ్లడంతో అవుట్ గా వెనుతిరగక తప్పలేదు.

ఈ రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా తనకి టైమ్ కలిసిరాలేదనే చెప్పాలి. లేదంటే వీటిని తను భారీస్కోర్లుగా మలిచేవాడు. ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకున్నాడంటే, ఒక పట్టాన యశస్వి వికెట్ ఇవ్వడు. క్రీజులో అంతగా స్టాండ్ అయిపోతాడు. ఇక ఇదే సిరీస్ లోని తొలిమ్యాచ్ లో 150 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com