పనితీరే ప్రాతిపదికగా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తున్నాం- పవన్ కళ్యాణ్
రాజకీయాల్లో కులం, మతం ప్రామాణికం కాదని, పనితీరే ప్రమాణికంగా తీసుకుని ప్రోత్సహించడం జగుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో చేసిన చిట్ చాట్ లో నాగబాబు మంత్రి పవదవిపై స్పందిచారు. జనసేన పార్టీలో నాగబాబు నాతో సమానంగా పనిచేశారని, వైఎస్సార్సీపీ నేతలతో దూషణలకు గురయ్యారనా పార్టీ కోసం ఆయన నిలబడ్డారని చెప్పారు. నాగబాబు మంత్రి పదవి విషయానికి వచ్చేసరికి కులం, బంధుప్రీతి లెక్కలోకి రావని, పార్టీ కోసం కష్టపడ్డాడా, పని చేశారా అన్నది చూడాలని పేర్కొన్నారు. మొదట నాగబాబుని అనకాపల్లి ఎంపీగా ప్రకటించి తరువాత కూటమిలో భాగస్వామ్య ధర్మం కోసం తప్పించామని, తరువాత నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభకు పంపుదామనుకున్నాం కానీ అదీ కుదరలేదు… దీంతో ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. అయినా ఇలాంటి విషయాలపై మీరు జగన్ని ఎందుకు ప్రశ్నించరని, పవన్ కళ్యాణ్ని మాత్రమే ఎందకు అడుగుతున్నారని విలేకరులను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్ లు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేశారని, పార్టీలో ఎవరికి ప్రతిభ ఉందో గుర్తించి వారికి పదవులు ఇస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కందుల దుర్గేష్ ఏ కులమో కూడా నాకు తెలియదు.. దుర్గేష్ పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చా అని పవన్ కళ్యాణ్ తెలిపారు.