28.7 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

ఏమైంది వీళ్లకి?

  • రోహిత్ , కొహ్లీలపై నెట్టింట జోరుగా చర్చ
  • ఒక్కరు కూడా ఆడకపోతే ఎలా? అనే ప్రశ్నలు

టీమ్ ఇండియాకి వెన్నుదన్నుగా నిలిచే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరు కూడా ఒకేసారి ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇది జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఏమైంది వీళ్లిద్దరికి? అనే ప్రశ్నలు నెట్టింట తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ఫామ్ కోల్పోతే ఒకటి , రెండు మ్యాచ్ లు గానీ, ఏకంగా ఏడాదిపాటు ఫామ్ లో లేకపోతే ఎలా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వీళ్లు ప్రాక్టీసు వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొహ్లీ లండన్ విమానం ఎక్కేస్తున్నాడు. రాహుల్ ముంబయిలో ఎంజాయ్ చేస్తున్నాడని తిట్టిపోస్తున్నారు. సీనియర్లు మాకేం పర్వాలేదనే ధోరణి వీళ్లలో కనిపిస్తోందని అంటున్నారు. ఐపీఎల్ పై ఉన్న శ్రద్ధ జాతీయ జట్టుకి ఆడటంలో కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈరోజు ఆడతారు, రేపు ఆడతారని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటే, నానాటికి తీసికట్టుగా ఇద్దరికి ఇద్దరూ మారారని అంటున్నారు. ఒకసారి వీళ్లు ఆడిన ఆఖరి పదిటెస్టులను పరిశీలిస్తే, వీరి పెర్ఫార్మెన్స్ ఎంత ఘోరంగా ఉందో తెలుస్తుంది.

కెప్టెన్ రోహిత్ శర్మ ఆడిన ఆఖరి పది టెస్టు మ్యాచ్ ల్లో, 18 ఇన్నింగ్స్ లు ఆడాడు. అందులో ఒక సెంచరీ, రెండు ఆఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అదికూడా మార్చి 7, 2024న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత 15 ఇన్నింగ్స్ నుంచి ఒక్క సెంచరీ లేదు. ఆఖరి 5 టెస్టు మ్యాచ్ ల నుంచి ఒక్క ఆఫ్ సెంచరీ కూడా లేదు. మొత్తమ్మీద 18 ఇన్నింగ్స్ లో 321 పరుగులు మాత్రమే చేశాడు.

ఇందులో 11 సార్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోయాడు.
ఒకసారి డకౌట్ అయ్యాడు. రెండు పరుగులు రెండుసార్లు, మూడు పరుగులు రెండు సార్లు, 5,6,8,9 ఇలా చేసుకుంటూ వెళ్లాడు. నిజానికి తను కెప్టెన్ అయ్యాడు కాబట్టి, జట్టులో కొనసాగుతున్నాడు కానీ, లేదంటే ఈపాటికే ఉద్వాసన పలికేవారని నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఇక విరాట్ కొహ్లీ విషయానికి వస్తే, రోహిత్ పై కొంత బెటర్ గానే ఉన్నాడు. అయినా సరే, ఇంతకాలం ఆడిన ఆటంతా ఎక్కడికి పోయిందో తెలీడం లేదు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో 4 టెస్టులు 7 ఇన్నింగ్స్ లో 167 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక సెంచరీ ఉంది. ఇక్కడ 4 సార్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు.

ఓవరాల్ గా చూస్తే ఆఖరి 10 టెస్టు మ్యాచ్ ల్లో తను 417 పరుగులు మాత్రమే చేశాడు. 19 ఇన్నింగ్స్ లో 24.52 సగటు ఉంది. ఇది విరాట్ కొహ్లీ కెరీర్ లోనే అత్యంత వరస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇయర్ గా పేర్కొంటున్నారు.
చాలామంది అనేమాటేమిటంటే సీనియర్లు ఇద్దరూ కూడా జట్టుకి భారంగా మారారు? ఇక నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని భాదాతప్త హృదయాలతో పోస్టింగులు పెడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com