34.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

మేం అప్పులు చేస్తే శ్రీలంక… చంద్రబాబు చేస్తే విజనరీనా…? బుగ్గన

అధికారం చేపట్టి ఎనిమిది నెలలు కాకుండానే కూటమి ప్రభుత్వం 1 లక్షా 12వేల 750 కోట్ల రూపాయల అప్పు చేసిందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజీగూడ లోని లోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం హయాంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు… ఇప్పుడు  చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తే మాత్రం విజనరీనా అని బుగ్గన ప్రశ్నించారు. ఎనిమిది నెలల్లోనే 1,12,750 కోట్ల రూపాయల అప్పులు చేశారంటే భవిష్యత్తులో ఇంకెన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తారో అని మాజీ మంత్రి ఆందోళణ వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని బుగ్గున ఆరోపించారు. చంద్రబాబు ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ళూ ఏమీ చెయ్యకుండా విజన్ 2020 అని ఒక సారి విజన్ 2047 అని మరోసారి ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన ఎద్దేశా చేశారు. ప్రజలు ఐదేళ్ళ కోసం అధికారం ఇస్తారా… ఇరవై ఏళ్ళ కోసం అధికారం ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో కూటమి గెలవడానికి ప్రధాన కారణం చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోనే అని ఇప్పుడు ఆ మ్యానిఫెస్టో ఏమయ్యిందని బుగ్గన అడిగారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 రూపాయలు, తల్లికి వందనం వంటి హామీలు ఎందుకు అమలు చెయ్యడం లేదని మాజీ మంత్రి నిలదీశారు. ప్రశ్నిస్తామన్నాయన ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com