32.5 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల ఫోకస్‌

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై పోలీసుల ఫోకస్‌ పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్భందీగా చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్‌, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, ఫిల్మ్‌నగర్‌, సరూర్‌నగర్‌ పబ్‌లలో ముందు జాగ్రత్తగా సోదాలు చేపట్టారు. వేడుకల పేరుతో డ్రగ్స్‌ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్‌ ఫ్రీ వేడుకలు నిర్వహిస్తామని యజమానుల నుంచి అండర్‌టేకింగ్ తీసుకున్న పోలీసులు… నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com