సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన జోనల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. సికింద్రాబాద్లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జోనల్ సెక్రెటరీ శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కాల్వ శ్రీనివాస్, జోనల్ కోశాధికారి సరోజినీ రెడ్డి, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీలు ఉదయ భాస్కర్,భారటే సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్ డివిజనల్ ప్రెసిడెంట్ ఖాజ బాబ, అసిస్టెంట్ డివిజనల్ సెక్రెటరీ లు చిలుకు స్వామి,రమేష్ కుమార్, PN శ్రీనివాస్, డివిజనల్ కోశాధికారి నర్సింహా రెడ్డి, జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులు బచ్చలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.