సిసి టీవీల్లో రికార్డైన దృశ్యాలు
అర్ధరాత్రి వేళ తుపాకీతో పలువురు యువకులు తుపాకీతో హల్ ఛల్ చేసిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద అర్ధరాత్రి కొంత మంది యువకులు రూఫిల్ చేతులో పట్టుకుని తిరుగుతుండటం సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. అయితే ఆ యువకులు ఎవరు, గన్ తో ఎందుకు అర్ధరాత్రి తిరుగుతున్నారు అనే విషయాలు ఏవీ ఇంత వరకూ వెల్లడి కాలేదు. కానీ వాసులు విషయాన్ని పోలీసులక తెలియజేసినా పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అర్ధరాత్రిళ్ళు దుండగులు తుపాకీలతో తిరుగుతుండటం సీసీ ఫుటేజిలో చూసిన కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకులు ఎంటర్ అయి ఈ విషయం బయటకు పొక్కకుండా మేనేజ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నయి. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు.