సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా జపాన్ ఎయిర్‌లైన్స్‌పై అటాక్ చేశారు. దీంతో ఆ ఎయిర్‌లైన్స్ సర్వీసులన్ని నిలిచిపోయాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాలన్ని ఎయిర్‌పోర్ట్‌కే పరిమితమయ్యాయి. సైబర్ అటాక్ దెబ్బకు ప్రయాణాలకు సంబంధించిన టికెట్ అమ్మకాలను కూడా నిలిపివేసింది ఎయిర్‌లైన్స్ సంస్థ. ఉదయం ఏడు గంటల 24 నిమిషాలకు ఈ సైబర్ అటాక్ జరిగింది. అయితే గంట తర్వాత సమస్య ఏంటో గుర్తించింది ఎయిర్‌లైన్ సంస్థ టెక్నికల్ టీమ్. సైబర్ అటాక్ కారణంగా బ్యాగేజీ చెక్ ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్య తలెత్తింది.
ప్రయాణీకుల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ అటాక్ వార్తల దెబ్బతో ఈ కంపెనీ షేర్లు 2.5 శాతం పడిపోయాయి. 1951లో జపాన్ ఎయిర్‌లైన్స్‌ను స్థాపించారు. ప్రైవేట్ సంస్థగా ప్రారంభమైన జపాన్ ఎయిర్‌లైన్స్‌ను ప్రభుత్వం సొంతం చేసుకుంది. అయితే 1987లో మళ్లీ ప్రైవేటీకరణ జరిగింది. గతేడాది కూడా జపాన్‌లోని నగోయా పోర్ట్‌పై కూడా సైబర్ అటాక్ జరిగింది.