23.7 C
Hyderabad
Wednesday, October 28, 2026

Live Video

spot_img

సీయంతో భేటీకి సినీ పరిశ్రమ నుంచి 36 మంది హాజరు

సంధ్యా ధియేటర్ తొక్కిసలాట నేపథ్యంలో గడచిన వారం రోజులుగా ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య జరుగుతున్న వివాదానికి నేటితో తెరపడనుంది. గురువారం ఉదయం బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహలు పాల్గొననుండగా సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. నిర్మాతల నుంచి దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్,  నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్ , కె ఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్ తదితరులు ఉండగా హీరోల నుంచి వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ, హాజరు అవుతారని సమాచారం అయితే హీరో నాగార్జునను కూడా దిల్ రాజు ఆహ్వానించినట్లు తెలిసింది. ఇక దర్శకుల సంఘం నుంచి అధ్యక్షుడు వీర శంకర్, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట , త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మలు ఉన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ , సెక్రటరీ దామోదర్ ప్రసాద్ లు హాజరవుతారు వీరు కాకుండా మా అసోసియేషన్ నుంచి , తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com