25.5 C
Hyderabad
Wednesday, October 28, 2026

Live Video

spot_img

ఇంధన డిమాండ్‌ తీర్చేందుకు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ

హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండును తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని, వివిధ రంగాలలో విస్తరించి ఉన్న విభిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందన్నారు. రాష్ట్రం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యాక్రమాల వల్ల, తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 2023-24లో 15,623 మెగావాట్ల నుండి 2027-28లో 20,968 మెగావాట్లకు, 2034-35లో 31,809 మెగావాట్లకు పెరుగుతుందని తెలిపారు. విద్యుత్ అవసరాలు 2023-24లో 85,644 మిలియన్ యూనిట్ల నుండి 2027-28 లో 1,15,347 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని, అలాగే, 2034-35లో 1,50,040 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు.

తెలంగాణ రాష్ట్రం 2030 నాటికి స్వచ్ఛమైన మరియు స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో వున్నదని తెలిపారు. అలాగే, హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండును తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోడానికి, జనవరి మూడో తేదీన హైదరాబాద్ హైటెక్స్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో భాగస్వాములతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశ , విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com