మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వచ్చేనెల 10వ తేదీ నుంచి మొట్టమొదటి రాష్ట్రస్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు మోడర్న్ కబడ్డీ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ రాంరెడ్డి, తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఐలయ్య తెలిపారు. మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్ల ఆకమిటీ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు జిల్లా పరిషత్ స్కూల్ గ్రౌండ్లో జనవరి 10, 11, 12 తేదీల్లో ఈ టోర్నమెంట్స్ జరుగుతాయన్నారు. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లా నుంచి టోర్నమెంట్లో జిల్లా స్థాయి టీమ్లు పాల్గొనవచ్చని, టోర్నమెంట్లో పాల్గొనే టీమ్లు ముందుగా ఆర్గనైజర్లను సంప్రదించి నమోదు చేయించుకోవాలని సూచించారు.