భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. రాజ్యంగం పట్ల బిజెపి కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎఐసిసి పిలుపు మేరకు ఈ రోజు హైదరాబాద్ లో పిసిసి అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హైదరబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఎంపి అనిల్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, జాతీయ నాయకుడు కొప్పుల రాజు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షలు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్దకు భారీగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.
అమిత్ షాను బర్తరఫ్ చేయాలి… టీపీసీసీ డిమాండ్
- Advertisement with us -