27.7 C
Hyderabad
Sunday, May 3, 2026

Live Video

spot_img

పుష్ప 2 ఓటీటీ లో ఎప్పుడంటే?

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి అత్యధిక వసూళ్లు రాబట్టిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి ఎప్పుడొస్తుంది? థియేటర్లకు వెళ్లి చూడలేని బన్నీ అభిమానులు ఈ మూవీ ఓటీటీ లోకి ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అందరూ అనుకున్నట్లు పుష్ప2ని అంత త్వరగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో చూసే అవకాశం లేదు. ఇంకా మరో నెల్లాళ్లు దాని కోసం ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఏదైనా మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రావాలంటే విడుదల తేదీకి, డిజిటల్ కి కనీసం 56 రోజుల గ్యాప్ ఉండాలి. ఈ లెక్కన పుష్ప 2 వచ్చే ఏడాది లోనే డిజిటల్ లోకి రానుంది. అంటే ఇంకా మరో నెల్లాళ్లు థియేటర్లలోనే పుష్ప 2 చూడొచ్చు.
జనవరి 29తర్వాత ఇది నెట్ ఫ్లిక్స్ లో ఎయిర్ కానుందని మైత్రీ మూవీ మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1,500 కోట్లు కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీకి ఇండియాలో దాదాపు వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. పుష్ప2 కి సంక్రాంతి కలెక్షన్లు కూడా బాగా ఉండొచ్చని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి థియాట్రికల్ రన్ పైనే ద్రుష్టి పెట్టిన నిర్మాతలు థియేటర్లలో జనం పలచబడ్డాక ఓటీటీలోకి ప్రవేశపెడతారని టాక్.

విడుదలకు ముందే వివాదాల పాలు

అల్లు అర్జున్ మెయిన్ రోల్ లో నటించిన పుష్ప 2 మూవీ విడుదలకు ముందే వివాదాలు మూటగట్టుకుంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షో ప్రదర్శన విషాదాంతంగా మారింది. సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు ఆస్పత్రిలో మ్రుత్యువుతో పోరాడుతున్నాడు. ప్రీమియర్ షోకు విచ్చేసిన అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం, అరెస్టు ఆపై మధ్యంతర బెయిల్ పై విడుదల అవడం జరిగింది. అయితే అర్జున్ వ్యవహార శైలే ప్రమాదానికి కారణమని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు, తన వ్యక్తిత్వాన్ని మంటగలుపుతున్నారని అర్జున్ కామెంట్ చేయడంతో పోలీసులు దూకుడు పెంచారు. ఆయన ప్రెస్ మీట్ బేస్ చేసుకుని ఘటన జరిగినరోజు అసలు ఏం జరిగింది అన్న అంశంపై అతని స్టేట్మంట్లను రికార్డు చేశారు. విచారణ ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com