33.7 C
Hyderabad
Sunday, May 3, 2026

Live Video

spot_img

పెళ్లి తర్వాత మహానటి హాట్ షూట్

దక్షిణాది సినిమాల్లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కీర్తి సురేశ్ ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. కీర్తి మొదటి హిందీ సినిమా బేబీ జాన్ క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇందులో వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించాడు. పెళ్లి కార్యక్రమాలు ముగియగానే కీర్తి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియాకు విడుదల చేసింది.

మహానటి త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనుందని సినీ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివేది’ సినిమాలు చేస్తోంది. వీటి తర్వాత కొత్త ప్రాజెక్టులు లేకపోవటం సందేహాలకు తావిస్తోంది.

సినిమాల్లో మంచి డిమాండ్ ఉన్నపుడే  కీర్తి తన ప్రియుడు అంటీనీని పెళ్లి చేసుకుంది. పెళ్లి పీటల మీదకు ఎక్కే వరకు వరుడు ఎవరో చెప్పకుండా గుట్టుగా వ్యవహరించింది. ఏ సినిమా ఫంక్షన్లో కూడా కీర్తి బాయ్ ఫ్రెండ్ కనిపించలేదు. వారి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినందునే ఇది సాధ్యమైందని…ఈ ఎపిసోడ్ విశ్లేషిస్తే పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందని అంటున్నారు. పెళ్లైన వారం రోజులకే సినిమా ప్రమోషన్ కు వెళ్లటం ఇందుకు నిదర్శనం అంటున్నారు.

పెళ్లి కీర్తి సినిమా కెరీర్ మీద ప్రభావం చూపదని స్పష్టమవుతోంది. అలియా భట్, ఐశ్వర్య రాయ్ సహా చాలా మంది నటీమణులు పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. కీర్తి సురేష్ వీరి బాటలోనే  నడిచే అవకాశాలు ఉన్నాయి.

సినిమా ప్రమోషన్స్ లో బేబీ జాన్ హీరో వరుణ్ ధావన్ తో హద్దులు మీరి వ్యవహరించిందని కామెంట్స్ వస్తున్నాయి. గతానికి భిన్నంగా వరుణ్ తో సాన్నిహిత్యం…రెడ్ డ్రెస్ లో అందాల ఆరబోత చూస్తుంటే బాలీవుడ్ లో పాగా వేసేందుకు మహానటి మహా ప్రయత్నాలే చేస్తోందని అర్థం అవుతోంది. అందులో భాగమే ఈ హాట్ షూట్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com