మరో యూత్ ఫుల్ థ్రిల్లర్ థియేటర్లలోకి రాబోతుంది. అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మాతలుగా, శ్రీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వారధి’. ఈ మూవీ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఫ్రీరిలీజ్ ఫంక్షన్ జరుపుకుంది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎర్రచీర మూవీ డైరెక్టర్ సుమన్ మాట్లాడుతూ… “ఇది యూత్ ను ఆకట్టుకునే రొమాన్స్ థ్రిల్లర్ లా ఉంది. కాన్సెప్ట్ బాగుంది. హిట్ కొట్టాడం ఖాయంగా కనిపిస్తోంది. డైరెక్టర్ కు, చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు.” అని చెప్పారు.
‘వారధి’ లో ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను కలిపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేశారు. చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.