ఇజ్రాయెల్ కీలక ప్రకటన
గత జూలై మాసంలో హత్యకు గురైన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేని తామే అంతం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వెల్లడించారు. ఇజ్రాయెల్ మీద క్షిపణిలు ప్రయోగిస్తున్న హౌతీ ఉగ్రవాద సంస్ధకు ఒక స్పష్టమైన సందేశం పంపాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. నస్రల్లా, సిన్వర్, హనియాలను హతమార్చడంతో పాటు హమాస్, హిజబొల్లాల మౌలిక వ్యవస్ధలను దెబ్బతీసామాని ఇజ్రాయేలు మంత్రి ప్రకటించారు. అదేవిధంగా సిరియాలో అల్ అసద్ ను పదవీచ్యుతుడ్ని చేశామని, హౌతీలకు కూడా మా దెబ్బ రుచి చూపిస్తామని కాట్జ్ స్పష్టం చేశారు. గత జూలై మాసంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో హనియా హత్యకు గురయ్యారు. అయితే హనియా హత్యలో ఇజ్రాయెల్ పాత్ర ఉందని ఇరాన్ అప్పట్లోనే ఆరోపించింది. ఆ సమయంలో ఇరాన్ ఆరోపణలపై ఇజ్రాయెల్ స్పందించలేదు. తాజాగా ఆదేశ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ హనియా హత్య మా పనే అని దృవీకరించారు.