33.2 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో తప్పిన ప్రమాదం

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం తప్పింది. ఓ రైలు కరెంటు తీగెలను ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లడంతో అక్కడున్న వాళ్లందరూ భయాందోళనకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. తిరునెల్వేలి నుంచి పురులియాకు వెళ్తున్న 22606 నెంబర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం తెల్లవారు జామున ఐదు గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌కు చేరుకుంది. అక్కడ రైలు ఇంజిన్‌ను మార్చాల్సి ఉంది. ఈ క్రమంలోనే తొలగించిన ఇంజన్‌ ముందుకు వెళ్తూ పైన ఉన్న విద్యుత్‌ తీగలను సుమారు 100 మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లింది. అయితే, వెంటనే అది గమనించిన రైల్వే సిబ్బంది కరెంటు సరఫరా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ సంఘటనతో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు. కరెంటు తీగెలు, లైన్ల పనులు పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com