22.9 C
Hyderabad
Thursday, July 30, 2026

Live Video

spot_img

రాష్ట్ర అభవృద్ధికి వెన్నుముక సింగరేణి

  • సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు…
    -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

సింగరేణి కాలరీస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క  సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, బొగ్గు ఉత్ప‌త్తి ద్వారా రాష్ట్ర‌, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగ‌రేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తూ, రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోందని అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి సింగరేణి వెన్నెముకగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తెలంగాణలోని ఆరు జిల్లాల్లో లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జీవనాధారంగా ఉన్న సింగరేణిని కేవ‌లం బొగ్గు ఉత్పత్తికే ప‌రిమితం చేయ‌కుండా ఇతర రంగాలలోకి కూడా ప్రవేశించి మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సింగరేణి సంస్థ సుస్థిర భ‌విష్య‌త్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రమశక్తిని చాటుతూ సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమవాలని ఆయన కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com