26.7 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

కాంగ్రెస్ చెప్పిన బోనస్ బోగస్…కేటీఆర్

సాగు చేసే భూములకు మాత్రమే రైతుబంధు ఇస్తామని చెప్పడంతో అనేక మంది రైతులు రైతు భరోసాని కోల్పోతారని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల మూడు పంటలు కూడా పండిస్తారు.. మరి మూడుసార్లు రైతుబంధు ఇస్తారో లేదో ప్రభుత్వం చెప్పాలని కోరారు. రైతు భరోసా పైన అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భారత రాష్ట్ర సమితి ప్రెసిడెంట్ కేటీఆర్ మట్లాడారు. సంవత్సరానికి ఒకే పంటగా ఉండే పత్తి పంటకు రెండు సార్లు ఇస్తారా..ఇవ్వరా.. అనేది చెప్పాలన్నారు. పామ్ అయిల్ లాంటి వాణిజ్య పంటలతోపాటు… జామా, మామిడి వంటి ఉద్యాన వన పంటలకు రైతు భరోసా ఉంటుందా లేదో స్పష్టం చేయాలన్నారు. రైతు భరోసాపైన ఈరోజు సభలో ప్రభుత్వ నిర్ణయం చెప్పకుంటే చర్చ పెట్టి ఏం లాభం అన్నారు.

రైతు భరోసాపై ముందు నుంచే కుట్రలు

రైతు భరోసా కోసం బడ్జెట్లో కేటాయించింది కేవలం. రూ.15,075 కోట్లు.. 70 లక్షల మంది రైతన్నలకు 1.53 కోట్ల ఎకరాల చొప్పున ప్రతి సీజన్లో 15000 ఇవ్వాలి అంటే రూ.23 వేల కోట్లు అవసరమని కానీ 15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కోతలకు సిద్ధపడిన తర్వాతనే ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది అనేది సుస్పష్టంమన్నారు. రైతుబంధు నెత్త కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే టైం పాస్ చేస్తున్నారు. ఆరోజు హామీలు ఇచ్చినప్పుడు అందరికీ అన్ని అని చెప్పి ఇప్పుడు కొందరికి కొన్ని అని చెప్తున్నారు. ఇప్పుడు కోతల పేరుతో కొత్త కథలు చెబుతున్నరన్నారు. రాష్ట్రంలో ఈరోజు పాన్ కార్డులు ఉన్నవాళ్లు కోటి యాభై లక్షల మంది ఉన్నారని, వారందరికీ రైతుబంధు కట్ చేస్తారా అని ప్రశ్నించారు.

ఒక్కో రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వ ఎకరానికి రూ. 17500..!బాకీ -కెటిఅర్

పోయిన యాసంగి 2500..నిన్న వానాకాలం 7500.. ఇప్పుడు యాసంగి 7500 రూ..!ఇలా మెత్తంగా ఒక్కో రైతుకు కాంగ్రెస్ ఎకరానికి 17500 బాకీ పడ్డదన్నారు. ఈ విషయాన్ని రైతులందరూ గుర్తుంచుకోవాలన్నారు. రెండు విడతల రైతు భరోసాతోపాటు, ఒక విడత 5000 వేలే ఇచ్చి ఎగ్గొట్టిన 2500 కలిపితే.. రూ.17500 మేర సుమారు 26,775 కోట్ల రూపాయలు రైతన్నలకు బాకీ పడింది. ఈ మెత్తం రైతన్నలకు ఇచ్చేదాకా మా పార్టీ వదిలపెట్టదన్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు ఇచ్చిన హమీలను చర్చ సందర్భంగా కెటిఅర్ ఎండగట్టారు. ఎన్నికలకు ముందుు ముష్టి పదివేలు ఎందుకు? ఎకరానికి 15వేల రైతుభరోసా.. ఇస్తామన్నారు, రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బందు ఇవ్వాలని ముచ్చట్లు చెప్పారనన్నారు.

మా ప్రభుత్వం తెచ్చిన రైతుబందు దేశ వ్యాప్తంగా అనేక ప్రసంశలు

11 సీజన్లు.. 73 వేల కోట్లు.. రైతు ఖాతాల్లో నేరుగా సొమ్ము ఇచ్చామని తెలిపారు. మా ప్రభుత్వం తెచ్చిన రైతుబందు దేశ వ్యాప్తంగా అనేక ప్రసంశలు అందుకున్నదన్నారు. ఒడిషా..బెంగాల్..సహా అనేక రాష్ట్రాలు రైతుబంధు ను ఆదర్శంగా తీసుకొని నగదు బదిలీ పథకాలను ప్రవేశ పెట్టాయని తెలిపారు. కేంద్రంలోని బిజెపి కూడా మా రైతుబంధును కాపీ కొట్టి ప్రధానమంత్రికి పథకాన్ని ప్రారంభించింది కానీ పీఎం కిసాన్ లో అనేక కోతలను పెట్టిందన్నారు. అశోక్ గులాటీ .. అరవింద్ సుబ్రహ్మణ్యం.. రఘురాం రాజన్.. అభిజిత్ బెనర్జీ.. దేవిందర్ శర్మమ లాంటి ఎకనామిస్ట్ లు.. ఆగ్రో ఎకనామిస్టులు నుంచి.. ఐక్య రాజ్య సమితి దాకా అందరి ప్రశంసలు అందుకున్న స్కీం!. రైతును ఆదుకోవాడనికి.. వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి రైతబంధు తరహా పథకాలే మేలు అని ఆర్థికవేత్తలు.. వ్యవసాయ వేత్తలు ముక్తకంఠంతో చెప్పారు!

10 ఎండ్లలో రైతుబంధు.. దుర్వినియోగం కాలేదు

తెలంగాణ రైతు పచ్చబడితే కొందరి కళ్లు ఎర్రబడ్డాయి! అన్నదాత బాగుపడితే ఓర్వలేకపోయారు కొందరు అంటూ కాంగ్రెస్ పైన చురకలు వేశారు. వందల ఎకరాల పెద్ద రైతులకు లాభమని..పనిగట్టుకొని దుష్ప్రచారం చేసారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం! నూటికి 95 శాతం బక్క రైతులేఅని, రైతుబంధుతో చిన్న సన్నకారు రైతులకు ఇతోధికంగా మేలు జరిగిందన్నారు. ఈ సందర్భంగా కొన్ని లెక్కలను వివరించారు. 91.33శాతం లబ్ధి దారులు 5 ఎకరాలు కంటే తక్కువ భూమి వున్న చిన్న సన్నకారు రైతులే అని, 5నుంచి 10 ఎకరాలు వున్నమధ్య తరగతి రైతులు 7.28శాతం, 10 ఎకరాలు పైబడి వున్నవాళ్లు 1.39 శాతమే ఉన్నారు. 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమే ఉన్నారు. అయితే 72 వేల కోట్లరైతు బందులో కేవలం పెద్ద రైతులకు పోయింది కేవలం 1.39 శాతమే అని ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. ఈ 80 శాతం లబ్ధిదారులు దళిత గిరిజన బహుజన రైతులే! ఉన్నారు (బీసీ- 54.. ఎస్సీ-13.. ఎస్టీ-13 శాతం) మెత్తం రైతు బందు నిధుల్లో 70 శాతం రైతుబంధు పైసలు బీసీ..ఎస్సీ..ఎస్టీ రైతుల ఖాతాల్లోనే పడ్డాయన్నారు.

కాంగ్రెస్ చెప్పిన బోనస్ బోగస్ అయింది

పండించిన ప్రతి పంటకు మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఇస్తామని మ్యానిపెస్టోలో చెప్పారు. కాంగ్రెస్ మ్యానిపెస్టోలో చెప్పినట్టు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మార్పు అని ఊదరగొట్టింది కానీ చివరికి రైతుబంధును పేరు మార్చి రైతుబంధును రైతు భరోసాగా పేరు మార్చింది. ఇదేనా మీరు తేస్తామన్న మార్పు అని కెటిఅర్ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్ మీటింగ్ లోనే హామీలకు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏమైంది.. మరీ 12 నెలలైనా తొలి క్యాబినెట్ జరగలేదా.. లేక రాహుల్ అనుమతి రాలేదా అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసా లేదు రైతు భూమికి భరోసా అంతకన్నా లేదన్నారు. పొలంలో ఉండాల్సిన రైతులు జైళ్లలో ఉండాల్సి వస్తుందని, రైతన్న చేతికి సంకెళ్లు వేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ రుణమాఫీ పైన కెటిఅర్ సవాల్

ఏ గ్రామంలో అయిన 100 శాతం రుణమాఫీ అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్న కెటిఆర్, ఇందుకోసం ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డి పల్లెకి అయినా వెళ్ధామన్నారు. మరోవైపు రుణమాఫీ కూడా చేస్తామని నమ్మబలికిందని, 49,500 కోట్ల రూపాయల నుంచి అవసరమైతే.. డెడ్ లైన్లు, అడ్డగోలు మాటలతో రుణమాఫీ ఎత్తగొడుతున్నారు. డిసెంబర్ 9 తేదీన.. ఏకకాలంలో 2 లక్షల మాఫీ అన్నారు,రేపే బ్యాంకులకు ఉరికురికి లోన్ తెచ్చుకోండని చెప్పారని, ఒక ఏడాది కడుపు, నోరు కట్టుకుంటే 40వేల కోట్లు కష్టంకాదన్నారు! మాఫీ చేయడం..ఈజీ అన్నారు. మొన్న జూన్ కేబినెట్ నిర్ణయాల్లో 31 వేల కోట్లు మాఫీ.. 47 లక్షల మందికి లబ్ధి అని ప్రకటించారు..!నిన్న బడ్జెట్ లో రూ.26వేల కోట్లు కేటాయించారు..! తీరా..ఆఖరికి తేలిందని, 17,934 కోట్లు రూపాయలు.. 22 లక్షల 37వేల 848 మంది రైతులకే రుణమాఫీ అని చెప్పారు. తమకు రుణమాఫీ ఎందుకు కాలేదో అర్థంకాక.. లక్షలాది మంది రైతులు ఆందోళనలో ఉంటే.. కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుందన్నారు. రైతు భరోసాను ఎత్తగొట్టి రైతు రుణమాఫీ పేరిట చేసిన డ్రామా ఫెయిలైపోయిందన్నారు. ఏన్నికల ప్రచారంలో అందరికీ అన్నీ అన్నారు. ఇప్పుడు కొందరికే కొన్ని అని ఎందుకు కొంగజపం చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి తమ ఎమ్మెల్యేలకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి ముఖ్యమంత్రి 100% రుణమాఫీ అంటున్నారు.. ఎమ్మెల్యే 70 శాతం అంటున్నారు బయట రైతన్నలు మాత్రం 20% కూడా కాలేదు అంటున్నారు. లఘుచర్లలో రైతన్నలను జైలులో పెట్టినట్లుగా, అదానీ కోసము అన్నద్దమ్ముల కోసమో, అల్లుడి కంపెనీల కోసమో, బావమరిది అమృతం కోసం కాకుండా రైతన్నలకిచ్చిన హమీల అమలు కోసం పనిచేయాలని సిఎం కు విజ్ఞప్తి చేస్తున్నానని కెటిఅర్ అన్నారు.

మంత్రి కోమటి రెడ్డికి కెటిఅర్ కౌంటర్

ఈరోజు 24 గంటల పాటు రాష్ట్రంలోని రైతన్నలకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు లాక్ బుక్కుల్లో చూపిస్తే మా పార్టీ శాసనసభ్యులమంతా రాజీనామా చేస్తాం

మా ప్రభుత్వం గతంలో 19 1/2 గంటల పాటు నిరంతర విద్యుత్తు ఇచ్చిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలోనే పేర్కొన్నారు

నల్గొండ జిల్లా పైన జరిగిన అభివృద్ధి పైన ప్రత్యేకంగా చర్చ పెడతామన్న మాకేం ఇబ్బంది లేదు.. మేము సిద్ధంగా ఉన్నాను

రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా వరి ధాన్యం పండించిన నల్గొండ జిల్లాను వ్యవసాయ రంగంతీర్చిదిద్దాము

మా మెడ మీద కేంద్ర ప్రభుత్వం కత్తిపెట్టినా… 30 వేల కోట్ల రూపాయలను వదులుకున్నాము కానీ వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టలేదు

కోమటి రెడ్డికి దమ్ముంటే ఏ నల్లోగొండ గ్రామానికైనా పోదాం.. నీళ్లు ఇచ్చింది ఏవరో చెప్పాలి

పాలమూర్ ప్రాజెక్టులు, సాగుపైన జూపల్లికి కెటిఅర్ కౌంటర్

పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులను వదిలిపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం

పాలమూర్ వలసలు అపింది.. సాగును పెంచింది బిఅర్ఆస్ ప్రభుత్వమే

మంత్రులు అప్పులపైన ఒక్కో మాట చెబుతున్నారు… చదువుకుని రావాలి

రైతులకు నీళ్లిచినందుకు సాగునీరు ఉచితంగా ఇచ్చినం

వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టినం.. భవిష్యత్తులోనూ ఇలానే రైతన్నలకు ఉచితంగానే ఇస్తాం…

గతంలో సిఏం రేవంత్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించిన కెటిఅర్

గతంలో తెలంగాణ పరిస్ధితిని గుర్తు చేస్తూ… రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగ పరిస్థితి పైన గ్రామాల పరిస్థితి పైన ఇచ్చిన స్పీచ్ ను ప్రస్తావించిన కేటీఆర్. ఆనాడు గ్రామాల్లో చనిపోతే కూడా స్నానాలు చేసేందుకు నీళ్లు లేని దుఃఖ భరితమైన పరిస్థితి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రైతు ఆత్మ హాత్యలపైన ప్రశ్నలు అడిగితే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిందని గుర్తు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com