26.7 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు బంద్

రాష్ట్రంలో ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పుష్ప2 సినిమా తొక్కిసలాట ఆంశంపై శనివారం శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటించారు.  ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలకు అనుమతులు ఇవ్వమని తెగేసి చెప్పారు.

సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు సినిమాల విడుదలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చామని, అంతేకాని సామాన్యులు చనిపోతే ప్రభుత్వం చూస్తు ఊరుకోదని సీఎం చెప్పారు. సినిమాలతో డబ్బు సంపాదించే నటులు సామాన్యుల కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున 25 లక్షల సాయాన్ని సిఎం ప్రకటించారు.

తొక్కిసలాటపై గతంలోనే స్పందించిన సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిన్ ఫిట్ షోలకు ఇక అనుమతి ఇవ్వమని ప్రకటించారు. ఇదే ఆంశాన్ని మంత్రి శాసనసభలో అధికారికంగా ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com