లక్కీ భాస్కర్ తో మంచి ఫామ్ లో ఉన్న మీనాక్షి చౌదరీ న్యూ లుక్ ఫోటోలు విడుదల చేసింది. లక్కీ హీరోయిన్ సంప్రదాయబద్ధంగా సన్నటి నడుముతో మీనాక్షి దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీరంగంలోకి మీనాక్షి చౌదరీ అడుగుపెట్టింది.
పంజాబీ, హిందీ భాషల్లో వివిధ అల్బమ్స్ లో తన ప్రతిభ చాటిన మీనాక్షి తెలుగులోనే అధికంగా సినిమాలు చేసింది. ఖిలాడీ, హిట్ ది సెకండ్ కేస్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, గోట్, మట్కా సినిమాల్లో తళుక్కుమంది.
తమిళంలో సింగపూర్ సెలూన్, కొలై(హత్య) సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మీనాక్షి…2025లో రాబోయే విశ్వంభర, మెకానిక్ రాకీ సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది.
హర్యానాకు చెందిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.