విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. రైళ్లో బాలికలను అక్రమంగా తరలిస్తున్నారంటూ వచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు మెరుపు దాడులు చేశారు. రైలు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు రాగానే చేసిన దాడుల్లో 11మంది బాలికలను గుర్తించారు.
బాలికలను ఒడిశానుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు తేల్చారు. కిరండోల్, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికలను అక్రమంగా తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. బాలికలను తరలిస్తోన్న హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా సభ్యుడు రవి బిసోయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి బాలికలను అక్రమంగా రవాణా చేస్తుట్లు గుర్తించారు. బిసోయ్ తరలిస్తున్న వాళ్లంతా ఒడిశా నవరంగపూర్‌కు చెందిన బాలికలుగా తేలింది. అంతేకాకుండా ఈ ముఠా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, నేపాల్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి బాలికలను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆ ముఠా ఇప్పటి వరకు 100 మందికి పైగా బాలికలను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం కేసును విశాఖ రైల్వే పోలీసులు ఒడిశా పోలీసులకు అప్పగించారు.