ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రధానమైన హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు విషయమై చంద్రబాబు ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ నేతృత్వంలో ఈ మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ శనివారం ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ ఉప సంఘంలో హోంమత్రి అనిత, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణిలు సభ్యులుగా ఉంటారు. రవాణశాఖ ముఖ్యకార్యదర్శి ఈ మంత్రివర్గ ఉప సంఘానికి కన్వీనర్ గా ఉంటారు. ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న పలు రాష్ట్రాల్లో ఈ ఉప సంఘం పర్యటించి ఆయా రాష్ట్రాల్లో పథకం తీరుతెన్నులను అధ్యయనం చేయనున్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపసంఘానికి సూచించారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అధికారంలోకి వచ్చి ఆరు నెలలైన అమలు చెయ్యకపోగా ఇప్పుడు ఉప సంఘం పేరుతో హామీ అమలు మరింత జాప్యం చేయాలని కూటమి ప్రభత్వం చూస్తోందని వైఎస్సార్సీసీ ఆరోపిస్తోంది.
- Advertisement with us -