36.2 C
Hyderabad
Saturday, May 30, 2026

Live Video

spot_img

హౌతీ టెర్రరిస్టుల బరితెగింపు…ఇజ్రాయెల్‌పై దాడులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకు వరుస దాడులతో రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌కు షాక్ ఇచ్చారు హౌతీలు. ఏకంగా ఇజ్రాయెల్ రాజదాని టెల్ అవీవ్‌పై మిసైల్ అటాక్ చేశారు. ఈ దాడులను ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోవడం విశేషం. ఈ దాడుల్లో 14 మంది గాయపడ్డట్టు అధికారికంగా ప్రకటించింది ఇజ్రాయెల్.

నిజానికి గురువారం యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ టార్గెట్‌గా ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసింది. దీంతో హౌతీలు కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ప్రొజెక్టైల్‌ మిసైల్స్‌ను ప్రయోగించి లెటెస్ట్‌గా దాడి చేశారు. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ మద్ధతుతో హౌతీలు ఇజ్రాయెల్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపేవరకు ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు.

ఇరాన్‌ నుంచి హౌతీలకు ఎలాంటి ఆయుధాలు అందకుండా  ర్యలు తీసుకుంటున్నామని.. అందుకే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. అయితే హౌతీలు చేసిన ఈ దాడిని ఇజ్రాయెల్ ఎందుకు అడ్డుకోలేకపోయింది అనేది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక యాంటీ మిసైల్ వ్యవస్థ ఉంది. గగనతలంలో ఎగిరే పక్షిని సైతం మానిటర్ చేసే సత్తా ఇజ్రాయెల్ సొంతం. దూసుకొస్తున్న ప్రమాదాన్ని కనిపెట్టడం.. దారి మధ్యలోనే అడ్డుకొని పేల్చేసే వ్యవస్థ ఉంది. మరి హౌతీలు ప్రయోగించిన మిసైల్ ఈ వ్యవస్థను దాటుకొని ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది.

దీంతో హూతీల (Houthis) సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు ప్రతిదాడులు చేస్తున్నాయి. హూతీ దాడుల నుంచి యూదు పౌరులను రక్షించుకునేందుకు ఏ చర్య తీసుకోవడానికైనా వెనుకాడమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com