- తప్పుకోవాలని ఎలన్ మస్క్ ట్వీట్
- జర్మనీ ఎన్నికల నేపధ్యంలో దాడి ఘటనకు ప్రాధాన్యత
జర్మనీలోని మగ్డాబర్గ్ క్రిస్మస్ మార్కెట్ లో దాడి ప్రస్తుత జర్మన్ ఛాన్సలర్ అసమర్ధతకు నిదర్శనమని ప్రపంచ కుబేరుడు , ట్రంప్ టీమ్ కి అనధికారిక సలహాదారుగా వ్యవహరిస్తున్న ఎలన్ మస్క్ అన్నారు. ఛాన్సలర్ షుల్జ్ ఓ అసమర్ద చవట అని ఎక్స్ లో తిట్టి పోశారు మస్క్.. దాడికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని సలహా ఇచ్చారు. మగ్డా బర్గ్ మార్కెట్ లో కారు దూసుకుపోయిన ఘటన, అనంతర పరిణామాలపై ఎలన్ మస్క్ స్పందించారు.
ఏ ఎఫ్ డీ కూటమి దే భవిష్యత్తు
ప్రస్తుతం పదవిలో ఉన్న షుల్జ్ పార్టీకి ఏ మాత్రం ప్రభుత్వాన్ని నడిపే సమర్ధత లేదని, రైట్ వింగ్ ఆల్టర్నేటివ్ ఫర్ డెమోక్రసీ కూటమి మాత్రమే జర్మనీని ప్రస్తుత సంక్షోభం నుంచి బయట పడేయగలదని మస్క్ అభిప్రాయపడ్డారు. ఒపీనియన్ పోల్స్ లో ఈ పార్టీ రెండో స్థానంలో ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో మెయిన్ స్ట్రీమ్ పార్టీలన్నీ ఈ కూటమికి దూరం జరిగిపోయాయి.ప్రస్తుతం పదవిలో ఉన్న మధ్యే వాద వామపక్ష కూటమి ప్రభుత్వ గడువు ఫిబ్రవరి 23తో ముగిసిపోతుంది. ఇప్పటికే యూరప్ లోఇమ్మిగ్రేషన్ ను వ్యతిరేకించే అన్ని పార్టీలకు తన మద్దతు మస్క్ ప్రకటించారు. రైట్ వింగ్ ఆల్టర్నేటివ్ ఫర్ డెమోక్రసీ కూటమి కి కూడా మస్క్ మద్దతు తెలిపారు. ప్రస్తుత షుల్జ్ ప్రభుత్వం అక్రమ వలసదారులను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. బ్రిటన్ లోని రైట్ వింగ్ సంస్కరణల పార్టీ ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలో ఈ మధ్యే ఎలన్ మస్క్ ని కలసింది. ఈ పార్టీలకు ఆర్థిక సాయం అందించడానికి కూడా ఎలన్ మస్క్ ముందుకొచ్చారు.