32.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

పార్లమెంటు ఘటనలో రాహుల్ గాంధీపై కేసు నమోదు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదయింది. పార్లమెంట్‌ ప్రాంగణంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతల ఫిర్యాదుతో రాహుల్ గాంధీపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఇండియా కూటమి నేతలు నిరసన కార్యక్రమం చేపట్టగా, పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్డీయే, ఇండియా కూటమి పక్షాల ఎంపీల మధ్య తోపులాట జరిగింది.

ఈ ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్ పుత్ గాయపడ్డారు. ఈ ఇద్దరు ఎంపీలకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందించారు. కాగా, తమ పార్టీ ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంత్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం సహా పలు సెక్షన్‌ల కింద రాహుల్ పై కేసు నమోదు చేయాలని కోరారు. బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీ తదితరులపై బీఎన్ఎస్ సెక్షన్ 115, 117, 131, 351 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరో పక్క తోపులాట ఘటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే కింద పడిపోవడంతో గాయపడ్డారని, బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు విషయంలో అధికార పార్టీ ఎంపీలపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దీనిపై డీసీపీ (న్యూఢిల్లీ) దినేశ్ మహ్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మరోపక్క, ఇరుపక్షాలు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com