కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు కావడం పట్ల మాజీ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడు రాజ్యాన్ని ఏలితే ఎలా ఉంటుందో రేవంత్‌రెడ్డి పాలనతో తెలంగాణలో పరిస్థితి చూస్తే అలా ఉన్నదని విమర్శించారు. ప్రపంచ పటంలో తెలంగాణ ప్రాముఖ్యతని చూపించిన కేటీఆర్ పైన కేసు పెట్టడం దుర్మార్గమని ఆరోపించారు. అయినప్పటికీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు అక్రమ కేసులు ఎదుర్కోవటం కొత్తేం కాదన్నారు. హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ పార్టీ మూర్ఖపు కుట్రలను ఎదుర్కొంటామని, వాటిని సమర్థవంతంగా తిప్పికొడతామని స్పష్టం చేశారు.